Triumph: భారత్ లో ఒకేసారి 8 కొత్త బైకులను లాంచ్ చేసిన 'ట్రయంఫ్'...అయితే...!

Triumph launches 8 new models in India

  • భారత్ లో జోరు ప్రదర్శిస్తున్న బ్రిటీష్ బైకుల కంపెనీ
  • క్రోమ్ ఎడిషన్ పేరిట వివిధ మోడళ్ల ఆవిష్కరణ
  • లిమిటెడ్ ఎడిషన్ అని పేర్కొన్న ట్రయంఫ్
  • ఏడాది మాత్రమే అందుబాటులో ఉంటాయని వెల్లడి

బ్రిటీష్ బైకుల కంపెనీ 'ట్రయంఫ్' భారత్ లోనూ కార్యకలాపాలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ట్రయంఫ్ ఇప్పటికే పలు హైఎండ్ మోడళ్లను భారత్ లో ప్రవేశపెట్టింది. తాజాగా భారత్ లో 'క్రోమ్ ఎడిషన్' పేరిట ఏకంగా 8 మోడళ్లను లాంచ్ చేసింది. రాకెట్ 3 ఆర్, రాకెట్ 3 జీటీ, బోన్ విల్లీ టీ120, బోన్ విల్లీ బాబర్, బోన్ విల్లీ స్పీడ్ మాస్టర్, బోన్ విల్లీ టీ100, స్పీడ్ ట్విన్ 900, స్క్రాంబ్లర్ 900 మోడళ్లను తీసుకువచ్చింది. 

అయితే ఇవన్నీ లిమిటెడ్ ఎడిషన్ మోడళ్లు. ఒక ఏడాది మాత్రమే అందుబాటులో ఉంటాయి. 2022 చివరి నాటికి లేదా, 2023 ఆరంభంలో ఈ కొత్త బైకులు డీలర్ల వద్దకు చేరుకోనున్నాయి. 

ఈ ఏడాది ఆరంభంలో ట్రయంఫ్ గోల్డ్ లైన్ పేరిట లిమిటెడ్ ఎడిషన్ బైకులు ఆవిష్కరించింది. వీటికి భారత మార్కెట్లో మంచి స్పందన లభించడంతో ఉత్సాహంతో ఉన్న ట్రయంఫ్ అదే ఊపులో ఇప్పుడు క్రోమ్ ఎడిషన్ తీసుకువచ్చింది. వీటి ధరలు రూ.8.84 లక్షల నుంచి రూ.21.40 లక్షల ధర పలకనున్నాయి.

Triumph
Bikes
Chrome Edition
Limited Edition
India
  • Loading...

More Telugu News