Pragathi: కరోనా టైములో నగలు తాకట్టు పెట్టవలసి వచ్చింది: నటి ప్రగతి

Pragathi Interview

  • తల్లి పాత్రలతో ఆకట్టుకున్న ప్రగతి 
  •  తాజా ఇంటర్వ్యూలో వ్యక్తిగత విషయాల ప్రస్తావన 
  • ఆర్థికపరమైన ఇబ్బందులను అధిగమించిన తీరు
  • పరిస్థితులకు భయపడనంటూ వ్యాఖ్య  

హీరోయిన్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన ప్రగతి, ఆ తరువాత కాలంలో కేరక్టర్ ఆర్టిస్టుగా కెరియర్ ను కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ తరం హీరోలకు .. హీరోయిన్లకు తల్లి పాత్రలలో మెప్పిస్తున్నారు. అందమైన అమ్మగా ఫ్యామిలీ ఆడియన్స్ అభిమానాన్ని సంపాదించుకున్నారు. వరుస సినిమాలతో ప్రస్తుతం ఆమె చాలా బిజీ. తాజాగా 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' కార్యక్రమంలో పాల్గొన్న ఆమె తన గురించిన అనేక ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. 

" వైవాహిక జీవితం సాఫీగా సాగడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నించాను .. కుదరకపోవడం వలన విడాకులు తీసుకున్నాను. నా పిల్లలను నేనే ఎంతో కష్టపడి చదివించాను. తమ లైఫ్ కి సంబంధించిన నిర్ణయాలను తీసుకునే స్థాయికి వాళ్లు వచ్చేశారు. ఆర్ధికపరమైన ఇబ్బందులను ఫేస్ చేశాను. కరోనా సమయంలో అందరం నగలు తాకట్టు పెట్టుకునే ఆ రోజుల నుంచి గట్టెక్కడం జరిగింది. 

జీవితంలో కొన్ని సమస్యలు ఎదురైనప్పుడు నాకు కూడా ఒక సపోర్టు ఉంటే బాగుండేది అనే ఆలోచన వస్తూనే ఉంటుంది. కానీ జరిగిన దానిని తలచుకుంటూ .. బాధపడుతూ కూర్చుంటే అక్కడే ఆగిపోతాము. అందువల్లనే ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళుతున్నాను. ఎందుకంటే పరిస్థితులకు భయపడితే అవి మరింత భయపెడతాయి" అంటూ చెప్పుకొచ్చారు.

Pragathi
Open Heart With RK
Interview
  • Loading...

More Telugu News