KA Paul: మునుగోడులో కేఏ పాల్ మాస్ డ్యాన్స్... వీడియో ఇదిగో!

KA Paul mass dance video went viral

  • మునుగోడులో పోటీ చేస్తున్న కేఏ పాల్
  • నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటనలు
  • ఓటర్లను కలుస్తూ వారికి వినోదం పంచుతున్న వైనం
  • డ్యాన్స్ వీడియో వైరల్

మునుగోడు ఉప ఎన్నికలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తనదైన శైలిలో ప్రచారం కొనసాగిస్తున్నారు. ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా గద్దర్ తప్పుకోవడంతో, కేఏ పాల్ చివరి నిమిషంలో మునుగోడు బరిలో పోటీకి దిగారు. కాగా ప్రజాశాంతి పార్టీకి గుర్తింపు లేకపోవడంతో మునుగోడు ఉప ఎన్నికలో స్వతంత్ర్య అభ్యర్థిగా కేఏ పాల్ పోటీలో ఉన్నారు. 

ఈ నేపథ్యంలో, ఆయన మునుగోడు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ, ఓటర్లను కలుస్తున్నారు. అంతేకాదు, తన ట్రేడ్ మార్క్ విన్యాసాలు, మాస్ డ్యాన్సులతో ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఓ ఫోక్ సాంగ్ కు అదిరిపోయే స్టెప్పులేశారు. చుట్టూ జనం గుమికూడగా, తనకు మాత్రమే సాధ్యమైన హావభావాలతో అందరికీ వినోదం పంచారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విశేషంగా ఆకట్టుకుంటోంది. 

నిన్న దీపావళి సందర్భంగానూ మునుగోడు నియోజకవర్గంలో కేఏ పాల్ సందడి చేశారు. లోకల్ గా ఓ సెలూన్ లో హెయిర్ కట్ చేయించుకున్నారు. ఓటర్లకు మిఠాయిలు, మంచినీళ్ల బాటిళ్లు పంచారు. 

ఇవన్నీ ఒకెత్తయితే, ఇటీవల ప్రత్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కేఏ పాల్ షేక్ హ్యాండ్ ఇవ్వడం మరో ఎత్తు. ఆపై, కోమటిరెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం చేసి జనాలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు.

More Telugu News