Nikhil: '18 పేజెస్' రిలీజ్ డేట్ ఖరారు!

18 pages movie update

  • నిఖిల్ తాజా చిత్రంగా రూపొందిన '18 పేజెస్'
  • ఆయనతో మరోసారి జోడీకట్టిన అనుపమ
  • సంగీత దర్శకత్వం వహించిన గోపీసుందర్ 
  • డిసెంబర్ 23వ తేదీన విడుదల

నిఖిల్ నుంచి ఇటీవల వచ్చిన 'కార్తికేయ 2' సంచలన విజయాన్ని సాధించింది. హిందీలోను ఈ సినిమా రికార్డుస్థాయి వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాతో పాటు నిఖిల్ మొదలెట్టిన '18 పేజెస్' కూడా చిత్రీకరణ పరంగా ముగింపు దశకి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఖరారు చేసుకున్నారు. 

డిసెంబర్ 23వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇది ఒక విభిన్నమైన ప్రేమకథ .. ఈ సినిమాలో నిఖిల్ జోడీగా అనుపమ పరమేశ్వరన్ అలరించనుంది. గీతా ఆర్ట్స్ 2 - సుకుమార్ రైటింగ్స్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 'కుమారి 21 F దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. 

గోపీసుందర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. ఆయన బాణీలు ఈ సినిమాకి హైలైట్ గా నిలవనున్నాయని అంటున్నారు. 'కార్తికేయ 2' తరువాత నిఖిల్ - అనుపమ కలిసి నటించిన సినిమా కావడంతో, సహజంగానే అందరిలో ఆసక్తి ఉంది. ఈ సినిమాతో ఈ జంట మరో హిట్ అందుకుంటుందేమో చూడాలి.

More Telugu News