india pak match: ఇండియా-పాక్ మ్యాచ్ ఉత్కంఠ.. గుండెపోటుతో యువకుడి మృతి

Man dies of cardiac arrest while watching India Pakistan T20 match

  • సినిమా హాల్ లో మ్యాచ్ లైవ్ టెలికాస్ట్
  • మ్యాచ్ మధ్యలో కుప్పకూలిన యువకుడు
  • ఆస్పత్రికి తరలించేలోపే పోయిన ప్రాణం
  • అస్సాంలోని శివ్ సాగర్ జిల్లాలో ఘటన

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా-పాక్ ల మధ్య జరిగిన మ్యాచ్ చివరి బాల్ వరకూ ఉత్కంఠంగా కొనసాగింది. ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్ చూస్తూ ఓ యువకుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. అస్సాంలోని శివ్ సాగర్ లో జరిగిన ఈ దారుణం వివరాలు.. శివ్ సాగర్ లోని ఓ థియేటర్ లో ఇండియా-పాక్ మ్యాచ్ ను ప్రత్యక్ష ప్రసారం చేశారు. పెద్ద స్క్రీన్ మీద మ్యాచ్ చూడాలనే ఉద్దేశంతో క్రికెట్ ప్రేమికులు వెళ్లారు. 

అందులో బిటూ గొగోయ్ కూడా ఉన్నాడు. స్నేహితులతో కలిసి మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ చూస్తున్నాడు. మ్యాచ్ చూస్తూ తీవ్ర ఉత్కంఠతకు లోనై సీట్లోనే కుప్పకూలాడు. స్పృహ కోల్పోయిన బిటూ గొగోయ్ ను అతడి స్నేహితులు దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు గొగోయ్ ఆస్పత్రికి తీసుకొస్తుండగానే ప్రాణాలు కోల్పోయాడని తేల్చారు. గొగోయ్ మరణానికి కార్డియాక్ అరెస్ట్ కారణమని వెల్లడించారు.

కార్డియాక్ అరెస్ట్..
గుండె పనితీరులో వచ్చే అకస్మిక మార్పులు, గుండె పనితీరు ఒక్కసారిగా మందగించడం, శ్వాస తీసుకోవడంలో సమస్య, స్పృహ కోల్పోవడం తదితర లక్షణాలు కార్డియాక్ అరెస్ట్ కు గురైన రోగిలో కనిపిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. వెంటనే చికిత్స అందకుంటే రోగి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. కార్డియాక్ అరెస్ట్ కు గురైన వ్యక్తికి ఎంతసేపట్లో సరైన చికిత్స అందిందనే దానిపైనే ఆ రోగి బతికే అవకాశాలు ఉంటాయని వివరించారు.

  • Loading...

More Telugu News