Rajendra Prasad: మోహన్ బాబుగారిని చూస్తేనే భయం వేసేది: సీనియర్ హీరోయిన్ ప్రేమ

Prema Interview

  • 'ధర్మచక్రం'తో హీరోయిన్ గా పరిచయమైన ప్రేమ 
  • 'దేవి' సినిమాతో పెరిగిన పాప్యులారిటీ 
  • 14 ఏళ్ల తరువాత 'అనుకోని ప్రయాణం'తో రీ ఎంట్రీ
  • ఈ నెల 28వ తేదీన విడుదలవుతున్న సినిమా  

90లలో తెలుగు తెరకి పరిచయమైన అందమైన కథానాయికలలో ప్రేమ ఒకరు. కన్నడ సినిమాతో వెండితెరకి పరిచయమైన ప్రేమ, ఆ తరువాత 'ధర్మ చక్రం' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇక 'ఓంకారం' ..'మా ఆవిడ కలెక్టర్' .. 'దేవి' సినిమాలు ఆమెకి మరింత మంచి పేరును తీసుకుని వచ్చాయి. ఆ తరువాత సినిమాలకి దూరమయ్యారు. 

14 ఏళ్ల తరువాత 'అనుకోని ప్రయాణం' సినిమాతో ఆమె రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ నెల 28వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆమె 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొన్నారు. తన కెరియర్ కి సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నారు. " కన్నడలో 'ఓం' చూసి రామానాయుడు గారు 'ధర్మచక్రం' సినిమాలో అవకాశం ఇచ్చారు. అలా నేను తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యాను. 

నేను కొంచెం హైట్ ఎక్కువ .. కాకపోతే అది నా కెరియర్ కి అడ్డుకాలేదనే అనుకుంటున్నాను. 'రాయలసీమ రామన్న చౌదరి' సినిమాలో మోహన్ బాబుగారితో కలిసి నటించాను. ఆయనను డైరెక్టుగా చూడాలంటేనే భయపడేదానిని. అలాంటిది ఆయనతో పోటీపడి చేయవలసి వచ్చింది. ఆయన ఏమీ అనలేదు .. తిట్టలేదు. ఆయనతో కలిసి పనిచేయడాన్ని ఎప్పటికీ మరిచిపోలేను" అంటూ చెప్పుకొచ్చారు.

Rajendra Prasad
Narasimharaju
Prema
Anukoni Prayanam Movie
  • Loading...

More Telugu News