chattisgarh: కొరడా దెబ్బలు తిన్న ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి

Chhattisgarh CM Bhupesh Baghel getting whipped
  • విఘ్నాలు తొలగిపోవాలని కోరుకున్న బాఘెల్
  • గోవర్ధన్ పూజలో భాగంగా కొరడా దెబ్బలు
  • దీపావళి సందర్భంగా ఆలయంలో పూజలు
  • స్థానిక ఆచారాన్ని పాటించిన బాఘెల్
దీపావళి వేడుకల్లో భాగంగా ఆలయంలో పూజలు చేసిన ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్ ఆపై కొరడా దెబ్బలు తిన్నారు. ఇలా చేయడం వల్ల విఘ్నాలు తొలగిపోతాయని జజంగిరి గ్రామస్థుల విశ్వాసం.. అక్కడి ఆలయంలో జరిగిన పూజలో కొరడా దెబ్బలూ సాధారణమే. ఈ పూజలో పాల్గొన్న భక్తులు కొరడా దెబ్బలను కూడా కాచుకుంటారు. సోమవారం జజంగిరి వెళ్లిన ముఖ్యమంత్రి బాఘెల్ కూడా ఇలాగే కొరడా దెబ్బలు తిన్నారు. అనంతరం ఈ వీడియోను ట్విట్టర్ లో పెట్టడంతో అదికాస్తా వైరల్ గా మారింది. 

ఛత్తీస్ గఢ్ లో దీపావళి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. మంగళవారం ఉదయం దుర్గ్ జిల్లాలోని జజంగిరి గ్రామంలో గోవర్ధన్ పూజ జరగగా ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్ అందులో పాల్గొన్నారు. గౌరీ దేవికి ప్రత్యేక పూజలు చేసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. ఆ తర్వాత జరిగే తంతులో భాగంగా మిగతా భక్తులలాగే ముఖ్యమంత్రి బాఘెల్ కూడా కొరడా దెబ్బలు తిన్నారు. దీనివల్ల శుభం కలుగుతుందని స్థానికుల నమ్మకం. ఈ నమ్మకాన్ని, ఆచారాన్ని ముఖ్యమంత్రి బాఘెల్ కూడా పాటిస్తారు. ఏటా దీపావళి తర్వాతి రోజు జరిగే గోవర్ధన్ పూజలో పాల్గొంటారు.
chattisgarh
Bhupesh baghel
whipped
ritual
gauri puja

More Telugu News