Revanth: 'బిగ్ బాస్ హౌస్' లో మెరీనాపై ఫైమా ఫైర్!

Bigg Boss 6  Update

  • 50 రోజులను పూర్తి చేసుకున్న 'బిగ్ బాస్'
  • పోటీదారుల మధ్య పెరిగిన గొడవలు 
  • ఎవరూ వెనక్కి తగ్గని వైనం 
  • ఆసక్తికరంగా సాగిన నిన్నటి నామినేషన్స్       

బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో పోటీదారుల మధ్య గేమ్ మరింత పుంజుకుంది. ఎవరికివారు హౌస్ లో ఉండటం కోసం మరింత ఎఫర్ట్ పెడుతున్నారు. ఆదివారం రోజున అర్జున్ కల్యాణ్ ఎలిమినేట్ కావడంతో సత్య కన్నీళ్లు పెట్టుకుంది. ఆమెను విడిచి వెళ్లే సమయంలో అతను కూడా ఎమోషనల్ అయ్యాడు. స్టేజ్ పై నాగార్జున ఉన్న కారణంగా అతను తన ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకోవడానికి చాలా ప్రయత్నించాడు. 

ఎప్పటిలానే సోమవారం రోజున నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. మెరీనా తనకి ఫైమా ధోరణి నచ్చలేదంటూ ఆమెను నామినేట్ చేసింది. అందుకు ఆమె చెప్పిన కారణం నచ్చకపోవడంతో ఫైమా ఫైర్ అయింది. ఆ సమయంలో ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి. ఆ సమయంలో ఫైమా వాడిన పదజాలం పట్ల మెరీనా తీవ్రమైన అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. అయినా చివరివరకూ ఫైమా తగ్గలేదు. 

ఇక గీతూను రేవంత్ నామినేట్ చేసినప్పుడు కూడా ఇద్దరి మధ్య పెద్ద వాదన నడిచింది. రేవంత్ 'పెరుగు దొంగ' అనీ .. ఫుడ్ ఐటమ్స్ అందరి కంటే ఎక్కువగా లాగించేస్తూ . మిగతావారిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తాడంటూ మండిపడింది. రేవంత్ చే నామినేట్ చేయబడిన కీర్తి స్పందిస్తూ .. రేవంత్ నీడపడినా తనకి అసహ్యం అంటూ గొడవను పీక్స్ కి తీసుకుని వెళ్లింది. చివరికి అందరూ నామినేషన్స్ లో ఉండటం కొసమెరుపుగా అనిపిస్తుంది. .

Revanth
Marina
Geethika
Faima
Keerthi
  • Loading...

More Telugu News