Chiranjeevi: మాస్ ఎంట్రీతో అదరగొట్టేసిన మెగాస్టార్ .. 'వాల్తేరు వీరయ్య' టైటిల్ టీజర్ రిలీజ్!

Waltair Veerayya Title Teaser Released

  • చిరంజీవి 154వ సినిమాగా 'వాల్తేరు వీరయ్య'
  • మాస్ లుక్ తో అదరగొట్టేసిన మెగా స్టార్
  • ఆయన జోడీకట్టిన శ్రుతి హాసన్  
  • 'వాల్తేరు వీరయ్య' టైటిల్ ఖరారు 
  • సంక్రాంతికి సినిమా రిలీజ్

చిరంజీవి కథానాయకుడిగా బాబీ ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో, చిరంజీవి సరసన నాయికగా శ్రుతి హాసన్ అలరించనుంది. కెరియర్ పరంగా చిరంజీవికి ఇది 154వ సినిమా. 'వాల్తేరు వీరయ్య' అనే టైటిల్ ను ఈ సినిమా కోసం పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. దీపావళి కానుకగా అదే టైటిల్ ను ఖరారు చేస్తూ, టైటిల్ పోస్టర్ తో పాటు టైటిల్ టీజర్ ను రిలీజ్ చేశారు. 

వీరయ్య తనని సవాల్ చేసిన వారికి తనదైన స్టైల్లో సమాధానం చెప్పడమనే ఒక యాక్షన్ సీన్ పై ఈ టీజర్ ను రిలీజ్ చేశారు. రంగు బనీనుపై పూల చొక్కా .. పైకి కట్టిన లుంగీ .. చెవికి రింగులు .. మెళ్లో బంగారు చైన్లు .. ఒక చేతికి బంగారు కడియం .. మరో చేతికి గోల్డ్ వాచ్  .. బ్లాక్ స్పెట్స్ తో కనిపిస్తూ .. బీడీ దమ్ము కొడుతూ చిరంజీవి మాస్ లుక్ తో ఎంట్రీ ఇచ్చాడు. 

ఈ సినిమాలో వీరయ్యకి యూ ట్యూబ్ వీడియోస్ చేసే అలవాటు ఉందనే విషయాన్ని ఈ టీజర్ ద్వారా రివీల్ చేశారు. రౌడీలను కొట్టేసిన వీరయ్య .. 'ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్ .. షేర్ .. అండ్ సబ్ స్క్రైబ్  చేయండి' అంటూ లైవ్ లోనే వీడియో చేసేయడం చూపించారు. సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Chiranjeevi
Sruthi Hasan
Bobby
Waltair Veerayya Movie

More Telugu News