KTR: కోహ్లీపై ప్రశంసలు కురిపించిన కేటీఆర్

KTR praises Virat Kohli

  • పాక్ తో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్ లో భారత్ విజయం
  • ఒంటి చేత్తో ఇండియాను గెలిపించిన కోహ్లీ
  • కింగ్ కోహ్లీ ఆట అద్భుతమన్న కేటీఆర్

ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో నిన్న జరగిన ఉత్కంఠభరిత మ్యాచ్ లో పాకిస్థాన్ పై టీమిండియా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. 90 వేల మందికి పైగా అభిమానులతో కిక్కిరిసిపోయిన మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో కింగ్ కోహ్లీ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయారు. ఒకానొక సమయంలో ఇండియాకు ఓటమి తప్పదనే భావనకు అందరూ వచ్చేసిన తరుణంలో హార్దిక్ పాండ్యాతో కలిసి కోహ్లీ భారీ ఇన్నింగ్స్ ను నిర్మించాడు. 

53 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్ ల సాయంతో 82 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. మరోవైపు కోహ్లీ ఆటపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఇండియా - పాక్ గేమ్ కు సంబంధించిన హైలైట్స్ చూశానని... కింగ్ కోహ్లీ ఆట అద్భుతమని కొనియాడారు. కోహ్లీ ఆటకు అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పారు.

KTR
TRS
Virat Kohli
Team India

More Telugu News