Bellamkonda Ganesh: దీపావళి కానుకగా 'ఆహా'లో అడుగుపెట్టిన' స్వాతిముత్యం'

Swathi Muthyam Movie released in OTT

  • బెల్లంకొండ గణేశ్ హీరోగా రూపొందిన 'స్వాతిముత్యం' 
  • ఈ నెల 5వ తేదీన థియేటర్లకు వచ్చిన సినిమా 
  •  నేటి నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ 
  • ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే కంటెంట్  

బెల్లంకొండ గణేశ్ హీరోగా 'స్వాతిముత్యం' సినిమాతో పరిచయమయ్యాడు. వర్ష బొల్లమ్మ కథానాయికగా నటించిన ఈ సినిమా, కామెడీ టచ్ తో కొనసాగిన ఫ్యామిలీ ఎంటర్టైనర్. సితార బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి లక్ష్మణ్ కె కృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ 5 నెల వ తేదీన ఈ సినిమా థియేటర్లకు వచ్చింది. 'గాడ్ ఫాదర్' .. 'ది ఘోస్ట్' వంటి భారీ సినిమాలతో పాటు ఈ సినిమా విడుదలైంది. 

పెద్ద సినిమాలపై ఫోకస్ ఎక్కువగా ఉండటం .. ఈ సినిమాలో అసలు కంటెంట్ ఏమిటనేది ప్రమోషన్స్ లో జనాలకు ఎక్కించలేకపోవడం కారణంగా ఆశించిన స్థాయిలో ఈ సినిమాకి వసూళ్లు రాలేదు. దీపావళి కానుకగా ఈ రోజు నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ మొదలైంది. నిజానికి ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. అది కామెడీ టచ్ తో చివరి వరకూ కొనసాగుతుంది.

హీరో అతికష్టం మీద హీరోయిన్ ను లైన్లో పెట్టి ఆమెను పెళ్లి పీటలవరకూ తీసుకుని వస్తాడు. సరిగ్గా ముహూర్తం సమయానికి, తన చేతుల్లోని బిడ్డకి అతనే తండ్రి అంటూ మరో యువతి ఎంట్రీ ఇస్తుంది. అంతకుముందు ఏం జరిగింది? ఆ తరువాత ఏమౌతుంది? అనేదే కథ. నరేశ్ .. రాలేవు రమేశ్ .. గోపరాజు రమణ కామెడీ ఈ సినిమాకి హైలైట్. ఓటీటీలో ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది

Bellamkonda Ganesh
Varsha Bollamma
Swathi Muthyam Movie

More Telugu News