Sourav Ganguly: గంగూలీ సంచలన నిర్ణయం.. క్రికెట్ పరిపాలనకు పూర్తిగా దూరం!

Sourav Ganguly Backs Out Of Cricket Association Of Bengal Polls

  • బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్ష పదవీ వదులుకుంటున్న దాదా
  • ఈ నెల 31న జరిగే ఎన్నికల్లో తిరిగి పోటీ పడకూడదని నిర్ణయం
  • తన స్థానంలో అన్న స్నేహశిష్ కు పదవి  

బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ క్రికెట్‌ పరిపాలనకు పూర్తిగా దూరం అవుతున్నాడు. బీసీసీఐ పెద్దలు అధ్యక్షుడిగా రెండో పర్యాయం తనకు అవకాశం ఇవ్వకపోవడంతో నొచ్చుకున్న దాదా.. ఇకపై క్రీడా రాజకీయాలను స్వస్తి చెప్పాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఐపీఎల్ చైర్మన్ పదవి ఆఫర్ ను తిరస్కరించిన గంగూలీ బీసీసీఐకి దూరం అయ్యాడు. తాజాగా తన స్వరాష్ట్రంలో అసోసియేషన్‌ ఆఫ్‌ బెంగాల్‌ (క్యాబ్‌) అధ్యక్ష పదవి నుంచి కూడా తప్పుకుంటున్నాడు. ఈ నెల 31న జరిగే క్యాబ్ ఏజీఎంలో తాను అధ్యక్ష పదవికి పోటీ పడటం లేదని గంగూలీ ప్రకటించాడు.

తన అన్న స్నేహశిష్‌  ఏకగ్రీవంగా క్యాబ్‌ తదుపరి అధ్యక్షుడు అవుతాడని చెప్పాడు. బీసీసీఐ బాస్‌గా రెండోసారి అవకాశం రాకపోవడంతో క్యాబ్ అధ్యక్ష పదవికి తిరిగి పోటీ చేస్తానని గంగూలీ గత వారం చెప్పాడు. కానీ, ఇప్పుడు మనసు మార్చుకున్న దాదా తన అన్నకు అవకాశం ఇచ్చాడు. ఈ నేపథ్యంలో క్రికెట్‌ అడ్మినిస్ట్రేషన్‌ నుంచి గంగూలీ పూర్తిగా వైదొలిగినట్టయింది. దాంతో, దాదా తదుపరి ఏ మార్గం ఎంచుకుంటాడనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.

  • Loading...

More Telugu News