KTR: ఒకప్పుడు నల్గొండ జిల్లాలో అమ్మాయిని ఇవ్వాలంటే ఆలోచించేవారు: కేటీఆర్

KTR attends Gowda people get together

  • మన్నెగూడలో గౌడ ఆత్మీయ సమ్మేళనం
  • హాజరైన కేటీఆర్
  • ఒకప్పుడు నల్గొండ జిల్లాలో నీటి సమస్య ఉండేదని వెల్లడి
  • ఇప్పుడు ఇంటి ముందే నల్లాతో నీరందిస్తున్నామన్న కేటీఆర్

మన్నెగూడలో నిర్వహించిన గౌడ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి పేదవాడికి తమ ప్రభుత్వం న్యాయం చేస్తోందని అన్నారు. తెలంగాణలో కరెంటు సమస్య తీరిపోయిందని తెలిపారు. 

ఒకప్పుడు నల్గొండ జిల్లాలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉండేదని, నల్గొండ జిల్లాలో అమ్మాయిని ఇవ్వాలంటే తల్లిదండ్రులు ఆలోచించేవారని పేర్కొన్నారు. ఇప్పుడు ఇంటి ముందే నల్లా ఏర్పాటు చేసి నీరు అందిస్తున్నామని కేటీఆర్ చెప్పారు. రైతు ధీమాగా వ్యవసాయం చేసుకోగలుగుతున్నాడని వివరించారు. 

ఈ సందర్భంగా కేటీఆర్ బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధించారు. బలహీనవర్గాలపై బీజేపీకి ప్రేమలేదని అన్నారు. మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ పబ్బం గడుపుకుంటోందని మండిపడ్డారు. 

గౌడ కులస్తులకు టీఆర్ఎస్ ప్రభుత్వమే అండగా ఉందని తెలిపారు. గీత కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని, గీత కార్మికులకు త్వరలో మోపెడ్ వాహనాలు ఇస్తున్నామని వెల్లడించారు. ప్రతి నెలా వారికి పెన్షన్లు ఇస్తున్నామని, చెట్ల పన్ను రద్దు చేశామని కేటీఆర్ చెప్పారు.

KTR
Gowda
Manneguda
TRS
Telangana
  • Loading...

More Telugu News