R Narayana Murthy: ఏపీ సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపిన ఆర్.నారాయణమూర్తి

R Narayana Murthy thanked AP CM Jagan

  • వైఎస్సార్ అవార్డులు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
  • ఆర్.నారాయణమూర్తికి లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు
  • సంతోషం వెలిబుచ్చిన పీపుల్స్ స్టార్

ఇటీవల ఏపీ ప్రభుత్వం వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డులను ప్రకటించడం తెలిసిందే. కళాతపస్వి కె.విశ్వనాథ్, పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తిలకు జీవితకాల సాఫల్య పురస్కారం ప్రకటించారు. దీనిపై ఆర్.నారాయణమూర్తి స్పందించారు. కె.విశ్వనాథ్ తో పాటు తనకు కూడా లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు ప్రకటించడం సంతోషం కలిగించిందని అన్నారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ కు, ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు. 

ప్రజల సమస్యలపై సినిమాలు తీస్తున్న తనను ప్రజలు పీపుల్స్ స్టార్ అని పిలుస్తుండడం ఆనందం కలిగించే విషయం అని తెలిపారు. 'అర్ధరాత్రి స్వతంత్రం' సినిమా నుంచి ప్రజా సమస్యలే అజెండాగా సినిమాలు తీస్తున్నానని ఆర్.నారాయణమూర్తి వివరించారు.

R Narayana Murthy
Jagan
YSR LIfe Time Achievement Award
Andhra Pradesh
  • Loading...

More Telugu News