YS Sharmila: మునుగోడులో ఏ పార్టీ గెలుస్తుందో చెప్పిన షర్మిల!

TRS will win in Munugode says YS Sharmila

  • మునుగోడులో టీఆర్ఎస్ గెలుస్తుందన్న షర్మిల
  • దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నిక తెలంగాణలో జరుగుతోందని వ్యాఖ్య
  • వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్టీపీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని వెల్లడి

మునుగోడు ఉప ఎన్నికలో ప్రధాన పార్టీలన్నీ విజయం సాధించడం కోసం తమ శక్తియుక్తులన్నింటినీ ధారపోస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకోవడానికి పలు వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. ఏ పార్టీ గెలుస్తుందో? ఇప్పటి వరకు ఎవరు ఎక్కువ మైలేజ్ సాధించారో చెప్పలేని పరిస్థితి ఉంది. మరోవైపు, ఈ ఉప ఎన్నికకు సంబంధించి వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

మునుగోడు ఎన్నికలో గెలిచేది టీఆర్ఎస్ పార్టీనే అని షర్మిల జోస్యం చెప్పారు. ఇదే సమయంలో కోమటిరెడ్డి సోదరులపై ఆమె విమర్శలు గుప్పించారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ని కోవర్ట్ రెడ్డి బ్రదర్స్ అని ఆమె సంబోధించారు. మరోవైపు మునుగోడు ఉప ఎన్నికలో వైఎస్సార్టీపీ ఎందుకు పోటీ చేయలేదనే ప్రశ్నకు సమాధానంగా... మునుగోడు ఉప ఎన్నిక ప్రజల కోసం జరగడం లేదని ఆమె అన్నారు. 

ఈ ఎన్నిక అధికార పార్టీకి, ఒక రాజకీయవేత్త అహంకారానికి మధ్య జరుగుతోందని చెప్పారు. దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నిక ఇప్పుడు తెలంగాణలో జరుగుతోందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని... తాను పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని చెప్పారు. తన రోల్ మోడల్ అన్న జగన్ కాదని... నాన్న రాజశేఖరరెడ్డి అని తెలిపారు.

YS Sharmila
YSRTP
Munugode
Komatireddy Venkat Reddy
Komatireddy Raj Gopal Reddy
TRS
  • Loading...

More Telugu News