Anu Emmanuel: రిపోర్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన అను ఇమ్మాన్యుయేల్

Anu Emmanuel anger on reporter

  • అల్లు శిరీశ్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా 'ఊర్వశివో రాక్షసివో' 
  • గతంలో అల్లు అర్జున్ తో కలిసి నటించిన అను
  • అన్నదమ్ముల్లో ఎవరు క్యూట్ అంటూ అనూకు రిపోర్టర్ ప్రశ్న

టాలీవుడ్ యంగ్ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్ కు కోపం వచ్చింది. తనకు చికాకు కలిగించే ప్రశ్నను అడిగిన రిపోర్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. వివరాల్లోకి వెళ్తే అల్లు శిరీశ్ తో కలిసి నటించిన 'ఊర్వశివో రాక్షసివో' త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఆమెకు చికాకు కలిగింది. 

మీరు అల్లు అర్జున్ తో 'నా పేరు సూర్య' చేశారు... ఇప్పుడు అల్లు శిరీశ్ తో 'ఊర్వశివో రాక్షసివో' చేశారు... అన్నదమ్ములిద్దరిలో ఎవరు క్యూట్? ఎవరు నాటీ? అని రిపోర్టర్ అడిగాడు. దీంతో ఆగ్రహానికి గురైన అను... అడగడానికి ఇంతకన్నా మంచి ప్రశ్నలు లేవా? అని అసహనం వ్యక్తం చేసింది. దీంతో సదరు రిపోర్టర్ మరో ప్రశ్న వేశాడు. ఈ సినిమాలో మీకు నచ్చిన సన్నివేశం ఏమిటని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా ఈ సినిమా ఇంకా విడుదల కాలేదని... అందువల్ల దీనికి సమాధానం చెప్పలేనని అన్నారు.

Anu Emmanuel
Allu Sirish
Allu Arjun
Urvasivo Rakshasivo
Tollywood
  • Loading...

More Telugu News