Madhya Pradesh: హైదరాబాద్ నుంచి గోరఖ్‌పూర్ వెళ్తున్న బస్సుకు ప్రమాదం.. 14 మంది దుర్మరణం

Road accident in Madhya pradesh Rewa 14 dead

  • దీపావళి కోసం స్వగ్రామాలకు వెళ్తున్న కూలీలు
  • మధ్యప్రదేశ్‌లోని రేవాలో ట్రాలీని ఢీకొట్టిన బస్సు
  • మరో 40 మందికి తీవ్ర గాయాలు
  • బాధితుల్లో మరికొందరి పరిస్థితి విషమం

హైదరాబాద్ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ వెళ్తున్న బస్సు మధ్యప్రదేశ్‌లో ప్రమాదానికి గురైంది. రేవా ప్రాంతంలో ఈ తెల్లవారుజామున సుహాగి పహారీ ప్రాంతంలో ట్రాలీని ఢీకొట్టింది. ఈ ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 20 మందిని ప్రయాగ్‌రాజ్ ఆసుపత్రికి తరలించారు. బాధితులందరూ యూపీకి చెందిన కూలీలేనని, దీపావళి పండుగ కోసం ఊరు వెళ్తున్నట్టు రేవా ఎస్పీ నవనీత్ బాసిన్ తెలిపారు.

ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. వాహనాలు తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. గాయపడిన వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

Madhya Pradesh
Rewa
Gorakhpur
Prayagraj
Uttar Pradesh
Road Accident
  • Loading...

More Telugu News