Pawan Kalyan: దాసోజు శ్రవణ్ ఒక డైనమిక్ లీడర్: పవన్ కల్యాణ్

Pawan Kalyan congratulates Dasoju Sravan

  • బీజేపీకి రాజీనామా చేసిన దాసోజు శ్రవణ్
  • శ్రవణ్ నిజమైన తెలంగాణ వాది అని పేర్కొన్న పవన్
  • ఏ పార్టీలో ఉన్నా తెలంగాణ కోసమే పనిచేశాడని ప్రశంస  
  • కంగ్రాచ్యులేషన్స్ అంటూ ప్రకటన 

తెలంగాణ నేత దాసోజు శ్రవణ్ బీజేపీకి గుడ్ బై చెప్పడం తెలిసిందే. పార్టీలో పరిణామాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన తన రాజీనామా లేఖను తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కు పంపించారు. ఈ నేపథ్యంలో, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. దాసోజు శ్రవణ్ కు అభినందనలు తెలిపారు. 

"కంగ్రాచ్యులేషన్స్" అంటూ ఓ ప్రకటన చేశారు. దాసోజు శ్రవణ్ ఒక డైనమిక్ లీడర్ అని కొనియాడారు. ఎంతో దార్శనికత ఉన్న రాజకీయ నాయకుడు అని, ప్రత్యేక తెలంగాణ కోసం ప్రజారాజ్యం పార్టీ నుంచి టీఆర్ఎస్ లో చేరారని వెల్లడించారు. 

ఆయన ఏ పార్టీలో ఉన్నా సరే, తెలంగాణ కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడ్డారని పవన్ కల్యాణ్ కితాబునిచ్చారు. దాసోజు శ్రవణ్ చిత్తశుద్ధిని ఇకనైనా అందరూ గుర్తిస్తారని ఆశిస్తున్నానని తెలిపారు. నా ప్రియ మిత్రుడు శ్రవణ్ కు భవిష్యత్తులో అంతా మంచే జరగాలని కోరుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు.

Pawan Kalyan
Dasoju Sravan
BJP
TRS
PRP
Telangana
  • Loading...

More Telugu News