Manchu Vishnu: మరో రెండేళ్లలో జరగబోయేది ఇదే: మంచు విష్ణు

Manchu Vishnu Interview

  • రిలీజ్ కి రెడీగా ఉన్న 'జిన్నా'
  • రేపు థియేటర్లకు రానున్న సినిమా 
  • ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న విష్ణు 
  • సర్ ప్రైజ్ చేయడం ఖాయమన్న హీరో

మంచు విష్ణు హీరోగా ఈ నెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి 'జిన్నా' రెడీ అవుతోంది. పాయల్ - సన్నీలియోన్ కథానాయికలుగా అలరించనున్న ఈ సినిమాకి సూర్య దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో విష్ణు బిజీగా ఉన్నాడు. తాజాగా ఒక వెబ్ సైట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో విష్ణు మాట్లాడుతూ .. "నేను యాక్షన్ కామెడీ జోనర్లో చేసిన సినిమాలు చాలావరకూ హిట్ అయ్యాయి. ఆ తరువాత వేరే జోనర్స్ లోకి వెళ్లడం పొరపాటు అయింది. అందువల్లనే 'జిన్నా'తో మళ్లీ యాక్షన్ కామెడీ వైపు వచ్చాను" అని అన్నాడు.

"గతంలో మాదిరిగా ఇతర భాషల్లోని కథలను స్ఫూర్తిగా తీసుకుని ఇక్కడ సినిమాలు చేసే పరిస్థితులు లేవు. ఓటీటీల వలన ఆడియన్స్ కి వెంటనే తెలిసిపోతోంది. అలాగే టీవీల్లో వచ్చే కామెడీ షోలకు మించిన కామెడీ ఇప్పుడు సినిమాల్లో ఉండేలా చూసుకోవలసి వస్తోంది. టాలెంట్ .. క్రియేటివిటీ అవసరం ఇప్పుడు మరింత పెరిగింది. అలా క్రియేట్ చేయబడిన కథనే 'జిన్నా'. ఈ సినిమా తప్పకుండా ఆడియన్స్ ను సర్ ప్రైజ్ చేస్తుంది. యాక్షన్ .. కామెడీ .. రొమాన్స్ తో పాటు మరో కోణం కూడా ఈ కథలో ఉంది. అది హారర్ నా .. థ్రిల్లరా? అనేది సినిమా చూసిన తరువాత మీరే చెప్పాలి" అన్నాడు. 

 ఈ మధ్య కాలంలో మా ఫ్యామిలీ హీరోల నుంచే కాదు .. ఇతర స్టార్ హీరోలు చేసిన సినిమాలు కూడా అంతగా ఆడని సందర్భాలు ఉన్నాయి. ఆడియన్స్ టేస్ట్ మారుతూ వస్తోంది. ఇతర దేశాల్లో మాదిరిగానే మన దగ్గర కూడా ఒక మార్పు సాధ్యమైనంత త్వరలో రానుంది. ఇక పై సినిమా వసూళ్లు అనేవి శుక్ర .. శని .. ఆదివారాలు మాత్రమే ఉంటాయి. ఆ తరువాత నుంచి గురువారం వరకూ ఏమీ ఉండవు. నాకు తెలిసి మరో రెండేళ్లలో ఈ పరిస్థితి ఇక్కడ కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు

Manchu Vishnu
Payal
Sunny Leone
Ginna Movie
  • Loading...

More Telugu News