Jr NTR: జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ కు ఊహించని స్వాగతం

Jr NTR gets surprise from hotel staff in Japan ahead of RRR release actor reacts to letter written in Hindi

  • హోటల్ లో పనిచేసే నేపాలీ మహిళ ప్రత్యేక పలకరింపు
  • తారక్ చేతికి స్వాగత లేఖ అందించిన మహిళ
  • ఆశ్చర్యపోయిన జూనియర్ ఎన్టీఆర్

తారక్ కు జపాన్ లోనూ అభిమానులు ఉన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ కోసం జపాన్ వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్ కు అపూర్వ స్వాగతం లభించింది. హోటల్ లో పనిచేసే నేపాలీ మహిళ ఒకరు వచ్చి ఒక ప్రత్యేకమైన లెటర్ అందజేసింది. తన గది బయట ఆ లేఖను జూనియర్ ఎన్టీఆర్ ఆశ్చర్యంగా చూడడమే కాకుండా చదివారు. ఆమెతో సంభాషించారు. ఆమె నేపాల్ కు చెందిన వ్యక్తిగా హోటల్ సిబ్బంది జూనియర్ ఎన్టీఆర్ కు వివరించారు. దీంతో తారక్ స్పందిస్తూ.. ‘‘ఓరి దేవుడా ఇక్కడ చాలా మంది ప్రజలున్నారు’’అని వ్యాఖ్యానించారు. తారక్ కు ఇచ్చిన లేఖపై ధన్యవాద్ అని రాసి ఉంది. 

ఆర్ఆర్ఆర్ సినిమా ఈ నెల 21న జపాన్ వ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనేందుకు రామ్ చరణ్, తన భార్య ఉపాసనతో కలసి మంగళవారం జపాన్ వెళ్లగా, తారక్ తన భార్యా, పిల్లలతో కలసి బుధవారం అక్కడికి చేరుకున్నారు. హోటల్లో దిగిన సందర్భంగా చోటు చేసుకున్న సన్నివేశం వీడియోను ఒకరు ట్విట్టర్లో పంచుకున్నారు.

More Telugu News