Naveen Chandra: నాతో మాట్లాడొద్దని నవీన్ చంద్రతో చెప్పేశాను: కలర్స్ స్వాతి

Swathi Interview

  • 'అమ్ము' సినిమాపై స్పందించిన కలర్స్ స్వాతి 
  • కంటెంట్ కి కనెక్ట్ అయ్యానంటూ వెల్లడి 
  • నవీన్ చంద్ర ఇండస్ట్రీకి దొరికిన జెమ్ అంటూ వ్యాఖ్య
  • అతను దిష్టి తీయించుకోవాలంటూనే ప్రశంసలు

కలర్స్ స్వాతి తెలుగుతో పాటు తమిళ .. మలయాళ భాషల్లో కూడా హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. పెళ్లి తరువాత సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన ఆమె, ఈ మధ్యనే మళ్లీ నటన వైపు దృష్టి పెట్టింది. నవీన్ చంద్ర - ఐశ్వర్య లక్ష్మి ప్రధానమైన పాత్రలను పోషించిన 'అమ్ము' సినిమా చూసిన స్వాతి, తనదైన శైలిలో స్పందించింది. 

'అమ్ము' సినిమా చూశాను .. కథ .. డైలాగ్స్ .. బ్యాక్  గ్రౌండ్ స్కోర్ కి కనెక్ట్ అయ్యాను. గతంలో నేను .. నవీన్ చంద్ర కలిసి నటించాము. 'త్రిపుర' సినిమాలోకి భిన్నంగా ఈ సినిమాలో ఆయన రోల్ ఉంది. నవీన్ మన ఇండస్ట్రీకి దొరికిన జెమ్ లాంటి వాడు. ఈ సినిమాలో ఆయన పోషించిన శాడిస్ట్ పాత్రను చూసి షాక్ అయ్యాను. దాంతో ఆయనను చూడాలంటేనే నాకు భయం వేసింది.  
ఇంటర్వెల్ లో ఆయన వచ్చి నాతో మాట్లాడబోతే .. ఆ సినిమా మూడ్ లోనే ఉన్న నేను, 'నాతో మాట్లాడకు .. ఇక్కడి నుంచి వెళ్లిపో' అని చెప్పేశాను" అంటూ నవ్వేసింది. 

నవీన్ చంద్రతో ప్రస్తుతం నేను 'మంత్ ఆఫ్ మధు' అనే సినిమాను చేస్తున్నాను. ఆ సినిమా షూటింగులో ఈ ప్రాజెక్టును గురించి చెబుతూ ఉండేవాడు. నవీన్ ఈ మధ్య కాలంలో డిఫరెంట్ రోల్స్ చేస్తూ వెళుతున్నాడు. తనకి ఎలాంటి పాత్రను ఇచ్చినా చాలా సిన్సియర్ గా చేస్తాడు. అలాగే ఈ సినిమాలో ఆయన అద్భుతంగా చేశాడు .. తను దిష్టి తీయించుకోవాలి" అంటూ స్వాతి చెప్పుకొచ్చింది.

Naveen Chandra
Aishwarya lakshmi
Swathi
Ammu Movie
  • Loading...

More Telugu News