RRR release: జపాన్ లో అభిమానులతో చరణ్, ఉపాసన

restaurant in Japan ahead of RRR release

  • రెస్టారెంట్ లో విందు పార్టీ
  • నవ్వుతూ ఫొటోలకు పోజు
  • ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసిన ఉపాసన
  • ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కోసం వెళ్లిన చరణ్

నటుడు రామ్ చరణ్, తన భార్య ఉపాసనతో కలసి జపాన్ లోని ఓ రెస్టారెంట్ లో ప్రత్యక్షమయ్యారు. అభిమానులతో కలసి విందు స్వీకరించారు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రధారులుగా వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చే శుక్రవారం జపాన్ లో విడుదల కానుంది. ఈ కార్యక్రమం కోసం రామ్ చరణ్ తన భార్యతో కలసి మంగళవారం జపాన్ వెళ్లాడు.

జపాన్ పర్యటన విశేషాల ఫొటోలను ఉపాసన తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. జపనీస్ అభిమానులతో వీరు రెస్టారెంట్ లో విందు పార్టీ చేసుకున్నారు. ఫ్యాన్స్ అందరూ నవ్వులు చిందిస్తున్న ఫొటోను ఉపాసన పోస్ట్ చేసింది. జపాన్ లో ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్స్ లో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి తదితరులు పాల్గొననున్నారు. ఇందుకోసం జూనియర్ ఎన్టీఆర్ కూడా తన కుటుంబ సభ్యులతో కలిసి జపాన్ వెళ్లాడు. ప్రపంచవ్యాప్తంగా రూ.1,000 కోట్ల వసూళ్లతో ఆర్ఆర్ఆర్ సంచలనం సృష్టించడం తెలిసిందే. 

RRR release
japan
Ramcharan
upasana
Jr NTR
promotions
  • Loading...

More Telugu News