Ramcharan: భార్య ఉపాసనతో కలిసి జపాన్ కు వెళ్లిన రామ్ చరణ్

Ramcharan and Upasana leaves to Japan

  • జపాన్ లో విడుదల కాబోతున్న 'ఆర్ఆర్ఆర్'
  • ఈ నెల 21 జపాన్ లో విడుదల
  • ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్లిన చరణ్, ఉపాసన

రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన 'ఆర్ఆర్ఆర్' సినిమా ఘన విజయం సాధించింది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రం దాదాపు రూ. 1,200 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా విజయంతో చరణ్ కు, తారక్ కు దేశ వ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. 

మరోవైపు ఇతర దేశాల భాషల్లోకి కూడా ఈ సినిమాను డబ్ చేసి విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఈ నెల 21న ఈ సినిమా జపాన్ లో విడుదల కాబోతోంది. ఇప్పటికే జపాన్ లో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించారు. ప్రమోషన్లో పాల్గొనేందుకు రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి జపాన్ కు వెళ్లాడు. ప్రత్యేక ఛార్టర్డ్ ఫ్లయిట్ లో వీరు జపాన్ కు వెళ్లారు. తారక్, రాజమౌళి, ఇతరులు కూడా జపాన్ కు బయల్దేరనున్నారు. అందరూ కలిసి ప్రమోషన్స్ లో పాల్గొంటారు.

Ramcharan
Upasana
Japan
RRR
  • Loading...

More Telugu News