Helicopter: కేదార్ నాథ్ సమీపంలో కుప్పకూలిన హెలికాప్టర్... ఏడుగురి మృతి

Helicopter crashed at Kedarnath

  • ఉత్తరాఖండ్ లో దుర్ఘటన
  • పైలెట్, ఆరుగురు యాత్రికుల మృతి
  • తీవ్ర విచారం వ్యక్తం చేసిన రాష్ట్రపతి, ప్రధాని

ఛార్ ధామ్ యాత్రకు భక్తులను తీసుకెళుతున్న హెలికాప్టర్ ఉత్తరాఖండ్ లోని కేదార్ నాథ్ సమీపంలో కుప్పకూలింది. రుద్రప్రయాగ్ జిల్లాలో ఈ మధ్యాహ్నం జరిగిన ఈ దుర్ఘటనలో ఏడుగురు మృతి చెందారు. వారిలో ఆరుగురు యాత్రికులు కాగా, హెలికాప్టర్ పైలెట్ కూడా మృతి చెందాడు. 

కూలిపోయిన కాసేపటికే హెలికాప్టర్ అగ్నికీలల్లో చిక్కుకుని దగ్ధమైంది. హెలికాప్టర్ శకలాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు సహాయచర్యలకు ఉపక్రమించారు. 

హెలికాప్టర్ ప్రమాదంపై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ, ఉత్తరాఖండ్ లో హెలికాప్టర్ కూలిన ఘటనతో తీవ్ర వేదనకు లోనయ్యానని తెలిపారు. బాధిత కుటుంబాల పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

Helicopter
Crash
Kedarnath
Char Dham
Uttarakhand
  • Loading...

More Telugu News