Vijay Devarakonda: త్రివిక్రమ్ ను ఒప్పించే ప్రయత్నంలో విజయ్ దేవరకొండ!

Vijay Devarakonda in Trivikram Movie

  • 'లైగర్' ఫ్లాప్ నుంచి తేరుకున్న విజయ్ దేవరకొండ 
  • షూటింగు దశలో ఉన్న 'ఖుషి'
  • త్రివిక్రమ్ ను లైన్లో పెట్టే ప్రయత్నం
  • రంగంలోకి శశికిరణ్ తిక్కా దిగే ఛాన్స్

విజయ్ దేవరకొండ ఇప్పుడు మూడు ఫ్లాపులతో ఉన్నాడు. రీసెంట్ ఫ్లాప్ అనిపించుకున్న 'లైగర్'తో విజయ్ దేవరకొండ ఆలోచనలో పడ్డాడని అంటున్నారు. 'లైగర్' ఫ్లాప్ అయినప్పటికీ అది పాన్ ఇండియా సినిమా అనిపించుకుంది. అందువలన అక్కడి నుంచి ఒక్కసారిగా కిందికి దిగేసి చిన్న దర్శకులతో పనిచేస్తే స్టార్ డమ్ దెబ్బతింటుంది. అందువలన ఒక రేంజ్ దర్శకులతోనే చేయాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నాడని అంటున్నారు.

ఈ నేపథ్యంలోనే ఆయన త్రివిక్రమ్ తో ఒక సినిమా చేయాలనే ఉద్దేశంతో, ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించాడని చెబుతున్నారు. కథను ఇవ్వడానికి తాను రెడీ అని త్రివిక్రమ్ అంటే, ఆయనే డైరెక్షన్ కూడా చేయాలని విజయ్ దేవరకొండ పట్టుబడుతున్నాడట. ప్రస్తుతం మహేశ్ మూవీతో త్రివిక్రమ్ బిజీగా ఉన్నాడు. ఆ తరువాత సినిమాను ఆయన బన్నీతో చేయనున్నాడని అంటున్నారు. అందువలన ఆయన విజయ్ దేవరకొండతో చేయడానికి ఒప్పుకుంటాడా అని డౌటు. 

ఒకవేళ త్రివిక్రమ్ డైరెక్షన్ కుదరదంటూ కథను మాత్రమే ఇస్తే, దర్శకుడిగా శశికిరణ్ తిక్కా రంగంలోకి దిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. 'మేజర్' హిట్ తో శశి కిరణ్ తిక్కాకి మంచి పేరు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక విజయ్ దేవరకొండ తన తాజాగా చిత్రంగా 'ఖుషి' చేస్తున్నాడు. సమంత కథానాయికగా కనిపించనున్న ఈ సినిమా, వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Vijay Devarakonda
Samantha
Trivikram Movie
  • Loading...

More Telugu News