Manchu Vishnu: మా ఫ్యామిలీ పై ట్రోల్స్ చేయిస్తున్న హీరో ఎవరో అందరికీ తెలుసు: మంచు విష్ణు

Manchu Vishnu Interview

  • 'జిన్నా' ప్రమోషన్స్ లో బిజీగా మంచు విష్ణు
  • తాజా ఇంటర్వ్యూలో ట్రోలింగ్ గురించిన ప్రస్తావన
  • ఐ డోంట్ కేర్ అంటూ సమాధానమిచ్చిన విష్ణు 
  • గమ్యానికి చేరుకోవడమే తన ముందున్న పని అంటూ వ్యాఖ్య  

మంచు విష్ణు తన తాజా చిత్రమైన 'జిన్నా'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సూర్య దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 21వ తేదీన థియేటర్లలో దిగిపోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మంచు విష్ణు ఒక యూ ట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంలో మంచు ఫ్యామిలీపై జరుగుతున్న ట్రోల్స్ కి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. ఈ ట్రోల్స్ వెనుక ఒక హీరో ఉన్నాడని కొంత కాలంగా విష్ణు చెబుతూ వస్తున్నాడు. అందువలన 'ఆ హీరో ఎవరో బయటపెట్టే ఉద్దేశమేదైనా ఉందా?' అంటూ ఆయనను అడిగారు. 

అందుకు విష్ణు స్పందిస్తూ .. 'మా' ఎలక్షన్స్ లో నేను పోటీ చేస్తున్నానని చెప్పిన దగ్గర నుంచే ట్రోల్స్ మొదలయ్యాయి.  ఒక మేధావి కూర్చుని మనుషులను పెట్టి చేయిస్తున్నాడు .. చేయిస్తూనే ఉంటాడు కూడా. అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఒక ప్రముఖ హీరో ఇదంతా చేయిస్తున్నాడని నేను చెబుతూ వస్తున్నాను. ఆ హీరో ఎవరనేది ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరికీ తెలుసు. మీడియావారికి  కూడా తెలుసు. ఆ హీరో ఎవరిరో తెలియదని ఎవరైనా అంటే వారు ట్రెండ్ లో లేనట్టు" అన్నాడు. 

"నా చుట్టూ ఉన్న ఇరవైమంది నా గురించి ఏమనుకుంటున్నారో అని ఆలోచిస్తూ కూర్చుంటే గమ్యానికి చేరుకోలేను. ఐ డోంట్ కేర్ అన్నట్టుగా నేను ముందుకు వెళుతూనే ఉంటాను. ఇక 'జిన్నా' విషయానికి వస్తే, ఈ సినిమాను నేను చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను.  టైటిల్ దగ్గర నుంచి సాంగ్స్ వరకూ మంచి రెస్పాన్స్ వచ్చింది. తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. నేను కూడా విడుదల తేదీ కోసం ఆసక్తితో వెయిట్ చేస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు. 

Manchu Vishnu
Payal
Sunny Leone
Ginna Movie
  • Loading...

More Telugu News