Nara Lokesh: కడపకు చేరుకున్న నారా లోకేశ్.. ఘన స్వాగతం

Nara Lokesh reached Kadapa

  • కడప సెంట్రల్ జైల్లో ఉన్న ప్రవీణ్ రెడ్డి
  • ప్రవీణ్ రెడ్డిని కలిసేందుకు వచ్చిన నారా లోకేశ్
  • మరో 17 మంది నేతలకు ములాఖత్ కు అనుమతి

టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ కడపకు చేరుకున్నారు. లోకేశ్ వస్తుండటంతో కడప విమానాశ్రయం వద్దకు టీడీపీ శ్రేణులు భారీగా చేరుకున్నాయి. ఎయిర్ పోర్టు వద్ద ఆయనకు జిల్లా టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి ఆయన కడప సెంట్రల్ జైలుకు రోడ్డు మార్గంలో చేరుకున్నారు. జైల్లో ఉన్న టీడీపీ ప్రొద్దుటూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రవీణ్ రెడ్డిని ఆయన పరామర్శించనున్నారు. ప్రవీణ్ రెడ్డితో ములాఖత్ అయ్యేందుకు నారా లోకేశ్ తో పాటు మరో 17 మంది నేతలకు అధికారులు అనుమతిని ఇచ్చారు. మరోవైపు, నారా లోకేశ్ పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

Nara Lokesh
Telugudesam
Kadapa
Central Jail
Praveen Reddy
  • Loading...

More Telugu News