YSRCP: ఏపీ ప్రభుత్వ సలహాదారుగా వైసీపీ మహిళా ఎమ్మెల్యే భర్త నియామకం

Singanamala mla jonnalagadda padmavathy husband appointed as advisor to ap government

  • విద్యాశాఖ సలహాదారుగా నియమితులైన సాంబశివారెడ్డి
  • శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్తే సాంబశివారెడ్డి
  • మురళి రాజీనామాతో ఖాళీ అయిన పోస్టులో నియామకం

ఏపీ ప్రభుత్వ సలహాదారుగా వైసీపీకి చెందిన ఆలూరు సాంబశివారెడ్డి నియమితులయ్యారు. విద్యా శాఖకు సంబంధించిన సలహాదారుగా ఆయన నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం సోమవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీలో కీలక నేతగా కొనసాగుతున్న ఆలూరు సాంబశివారెడ్డి అనంతపురం జిల్లాకు చెందిన నేత. అనంతపురం జిల్లా శింగనమల ఎమ్మెల్యేగా కొనసాగుతున్న జొన్నలగడ్డ పద్మావతి భర్తే సాంబశివారెడ్డి.

ఏపీ విద్యా శాఖ సలహాదారుగా గడచిన మూడేళ్లుగా పనిచేస్తున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మురళి ఇటీవలే తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణకు చెందిన మురళి... తన రాష్ట్రంలో విద్యా వ్యవస్థను చక్కదిద్దాల్సి ఉన్న కారణంగా పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. మురళి రాజీనామాతో ఖాళీ అయిన ఈ పోస్టులో జగన్ సర్కారు సాంబశివారెడ్డిని నియమించింది.

More Telugu News