Telangana: సీఎం కేసీఆర్ కు జ్వరం... మరో నాలుగు రోజుల పాటు ఢిల్లీలోనే

ts cm kcr suffering from fever in delhi

  • గత వారం ములాయం అంత్యక్రియల కోసం యూపీ వెళ్లిన కేసీఆర్
  • అటు నుంచి అటే ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి 
  • కేసీఆర్ ఆదేశాలతో ఢిల్లీ వెళ్లిన సోమేశ్ కుమార్, అరవింద్ కుమార్

ఢిల్లీ పర్యటనకు వెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్ కు సోమవారం జ్వరం వచ్చింది. గత వారం సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఉత్తర ప్రదేశ్ వెళ్లిన కేసీఆర్...ఆ కార్యక్రమం అనంతరం అటు నుంచి అటే ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వారం పాటు కేసీఆర్ ఢిల్లీలోనే ఉంటున్నారు. 

తాజాగా సోమవారం ఆయన జ్వరం బారిన పడటంతో మరో నాలుగు రోజుల పాటు ఆయన అక్కడే ఉండనున్నారు. సీఎం ఆదేశాల మేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ లు ఢిల్లీకి వెళ్లారు.

Telangana
TRS
KCR
New Delhi
Somesh Kumar
  • Loading...

More Telugu News