Samantha: సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా 'యశోద' .. రిలీజ్ డేట్ ఖరారు!

Yashoda movie release date confirmed

  • సమంత తాజా చిత్రంగా రూపొందిన 'యశోద'
  • సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ
  • కీలకమైన పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ 
  • నవంబర్ 11వ తేదీన సినిమా విడుదల  

సమంత తన సినిమాలకి సంబంధించిన కథాకథనాలపై ఎంతగా దృష్టి పెడుతుందనేది, ఆమె ఇంతవరకూ చేసిన సినిమాలే చెబుతాయి. నాయిక ప్రధానంగా ఆమె చేసిన సినిమాలు భారీ విజయాలను నమోదు చేశాయి. 'యూ టర్న్' .. 'ఓ బేబీ' సినిమాలే అందుకు నిదర్శనం. అలా మరోసారి ఆమె చేసిన లేడీ ఓరియెంటెడ్ సినిమానే 'యశోద'. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. 

శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన సినిమా ఇది. హరిశంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని సమకూర్చాడు. ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఈ సినిమాను నవంబర్ 11వ తేదీన విడుదల చేయనున్నట్టు చెబుతూ, అధికారిక పోస్టర్ ను వదిలారు. 

ఇప్పటికే ఈ సినిమా నుంచి వదిలిన అప్ డేట్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఉన్ని ముకుందన్ .. మురళీశర్మ .. సంపత్ రాజ్ .. వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. 'యశోద' పై బజ్ బాగానే ఉంది. ఇంకా సమంత వైపు నుంచి 'శాకుంతలం' .. 'ఖుషి' సినిమాలు కూడా లైన్లోనే ఉన్నాయి. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

Samantha
Unni Mukundan
varalakshmi Sharath Kumar
Yashoda Movie
  • Loading...

More Telugu News