: గుంటూరు డీసీసీబీ ఎన్నికలపై స్టే ఎత్తివేత
గుంటూరు జిల్లా డీసీసీబీ ఎన్నికలను నాలుగు వారాలపాటు నిలిపివేయాలంటూ ఇచ్చిన స్టేను హైకోర్టు నేడు ఎత్తివేసింది. ఈనెల 18 నుంచి 22 వరకు జిల్లాల సహకార బ్యాంకులకు ఎన్నికలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈరోజు నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఉపసంహరణకు రేపు తుది గడువు. ఈనెల 18న డైరక్టర్ల ఎన్నికలు జరుగుతాయి. నెగ్గిన డైరక్టర్లు 19న డీసీసీబీ అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకుంటారు. వీలైనన్ని ఎక్కువ డైరక్టర్ల సీట్లను గెలుచుకోవడం ద్వారా అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులను చేజిక్కించుకోవాలని అధికార కాంగ్రెస్ భావిస్తోంది.