Nikhil: ఈ సారి శ్రీరాముడి కాలంనాటి రహస్యాలు .. అయోధ్య నేపథ్యంలో 'కార్తికేయ 3'

karthikeya 3 movie update

  • సుబ్రహ్మణ్య స్వామి నేపథ్యంలో వచ్చిన 'కార్తికేయ' 
  • శ్రీకృష్ణుడి చుట్టూ తిరిగే కథతో వచ్చిన 'కార్తికేయ 2'
  • 'కార్తికేయ 3' ఉంటుందని హింట్ ఇచ్చిన డైరెక్టర్  
  • ఈ సారి శ్రీరాముడి నేపథ్యమే ప్రధానమైన కథాంశం

నిఖిల్ కెరియర్లో చెప్పుకోదగిన సినిమాలుగా 'కార్తికేయ' .. 'కార్తికేయ 2' కనిపిస్తాయి. ఈ రెండు సినిమాలకి కూడా చందూ మొండేటి దర్శకత్వం వహించాడు. 'కార్తికేయ 2' సినిమా రికార్డుస్థాయి వసూళ్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా తన సత్తా చాటుకుంది. ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందనే హింట్ ఇచ్చేయడం వలన, ఇప్పుడు అందరి దృష్టి 'కార్తికేయ 3' పైనే ఉంది. 

ఈ సినిమా సీక్వెల్ గురించి నిఖిల్ మాట్లాడుతూ, తాను ఎక్కడికి వెళ్లినా అందరూ 'కార్తికేయ 3' గురించే అడుగుతున్నారని అన్నాడు. తాను ఈ సీక్వెల్ చేసేవరకూ తనని వదిలేలా లేరని చెప్పుకొచ్చాడు. అయితే 'కార్తికేయ 3' ఏ అంశంపై ముందుకు వెళ్లనుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ విషయంపై అనేక రకాల ఊహాగానాలైతే వినిపిస్తున్నాయి. 

 సుబ్రహ్మణ్య స్వామి ఆలయం నేపథ్యంలో 'కార్తికేయ' కథ కొనసాగితే, ద్వారక నేపథ్యంలో 'కార్తికేయ 2' కథ కొనసాగింది. ఇక 'కార్తికేయ 3' కథ అంతా కూడా అయోధ్య నేపథ్యంలో ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. అంటే ఈ సారి కథ శ్రీరాముడికి సంబంధించిన రహస్యాలతో నడుస్తుందన్న మాట. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వస్తుందేమో చూడాలి.

More Telugu News