Manchu Vishnu: కోపంలో తప్ప అన్నిట్లో మా నాన్నే నాకు స్ఫూర్తి : మంచు విష్ణు

Ginna Movie Pre Release Event

  • ఈ నెల 21న వస్తున్న 'జిన్నా'
  • సందడిగా సాగిన ప్రీ రిలీజ్ ఈవెంట్
  • యాంకర్ సరదా ప్రశ్నలకు విష్ణు సమాధానాలు 
  • ఈ సారి హిట్ ఖాయమన్న టీమ్

హీరోగా .. నిర్మాతగా మంచు విష్ణు వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'జిన్నా' , ఈ నెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటులో మంచు విష్ణు మాట్లాడుతూ .. "ఇంత ప్రేమతో వచ్చిన మీ అందరికీ థ్యాంక్స్ చెబుతున్నాను. ముందుగా కోన వెంకట్ గారికీ .. ఆ తరువాత చోటాగారికి .. అనూప్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 

ఈ సినిమా నా మనసుకు మరింత దగ్గర అయింది. నా కెరియర్లోనే బెస్ట్ మ్యూజిక్ ఈ సినిమాకి కుదిరింది. ఈ సినిమా కోసం నా పిల్లలతో పాడించినందుకు చాలా సంతోషంగా ఉంది. మంచి కొరియోగ్రఫీని అందించినందుకు ప్రభుదేవా గారికీ .. ప్రేమ్ రక్షిత్ గారికి థ్యాంక్స్ చెబుతున్నాను. కామెడీ పరంగా వెన్నెల కిశోర్ .. చమ్మక్ చంద్ర మంచి మార్కులను కొట్టేశారు. 

యాంకర్ అడిగిన సరదా ప్రశ్నలకు సమాధానంగా .. తన తండ్రి నుంచి కోపం తప్ప మిగతా విషయాలను నేర్చుకున్నానని విష్ణు అన్నాడు. ఎమోషనల్ బ్లాక్ మెయిల్ ఎలా చేయాలో మా అమ్మను చూసి నేర్చుకోవచ్చని సెలవిచ్చాడు. ఇక తన భార్యను గురించి ప్రస్తావిస్తూ, చూపులతో ఎదుటివారిని బెదిరించి ఎలా కంట్రోల్ చేయాలనేది ఆమె దగ్గర నుంచి నేర్చుకోవచ్చు" అని చెప్పుకొచ్చాడు.

Manchu Vishnu
Payal
Sunny Leone
Ginna Movie
  • Loading...

More Telugu News