Gudivada Amarnath: పవన్ విశాఖలో ఉన్నంతవరకు ఆడపిల్లలు దయచేసి బయటికి రావొద్దు: మంత్రి గుడివాడ అమర్ నాథ్

Gudivada Amarnath satires on Pawan Kalyan marriages
  • పవన్ పై తీవ్ర విమర్శలు చేసిన ఏపీ మంత్రి
  • పెళ్లయిన వాళ్లకు కూడా కట్టేస్తాడేమోనంటూ విమర్శలు
  • పవన్ కు విశాఖ ఇప్పటికే ఓ పిల్లనిచ్చిందని వెల్లడి
  • పవన్ పెట్టె, బేడా సర్దుకుని వెళ్లిపోవాలన్న గుడివాడ అమర్ నాథ్
ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ విశాఖలో ఉన్నంతవరకు పెళ్లికాని ఆడపిల్లలు దయచేసి బయటికి రావొద్దని అన్నారు. 

పెళ్లయినవాళ్లకు కూడా కట్టేస్తాడేమోనని తనకు భయంగా ఉందని, పెళ్లికాని వాళ్లే కాదు, అసలు ఆడపిల్లలనే వీధుల్లోకి పంపొద్దని మంత్రి అమర్ నాథ్ తెలిపారు. షరతులు వర్తిస్తాయి అనే లెక్కలో పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్లపై ఇప్పటికే తన విధానాన్ని చెప్పాడని, అందుకే విశాఖలో అమ్మాయిలను బయటికి రావొద్దని చెబుతున్నానని వివరణ ఇచ్చారు. ఇప్పటికే విశాఖపట్నం పవన్ కు ఓసారి పిల్లనిచ్చిందని మంత్రి గుర్తుచేశారు. 

ఉగ్రవాద మనస్తత్వం కలిగిన ఇలాంటివారు మన రాష్ట్రంలో అధికారం చెలాయించాలని రావడం దురదృష్టకరం అని వ్యాఖ్యానించారు. పవన్ ఇకనైనా పెట్టె, బేడా సర్దుకుని షూటింగ్ లకు వెళ్లిపోతే మంచిదని అన్నారు.
Gudivada Amarnath
Pawan Kalyan
Vizag
YSRCP
Janasena

More Telugu News