: అంగారకుడిపై జీవం...!?
అంగారకుడిపై జీవం గురించి చేస్తున్న పరిశోధనలకు ఒక ఊతం దొరికినట్టయింది. ఆ గ్రహంపై చిన్న ఎలుకను శాస్త్రవేత్తలు గుర్తించారు. అరుణగ్రహంపై వాతావరణం ఎలా ఉంది? అనే విషయాన్ని గురించి అధ్యయనం చేయడానికి నాసా క్యూరియాసిటీ అనే రోవర్‌ను ప్రయోగించింది. ఈ రోవర్ గ్రహంలో నియమిత ప్రాంతాల్లో తిరుగుతూ అక్కడి వాతావరణం గురించి అంచనా వేయడానికి ప్రయత్నిస్తోంది. ఈ రోవర్ తీసిన రాళ్లతో కూడిన అంగారక ఉపరితలానికి సంబంధించిన ఫోటోల్లో దుమ్ము కొట్టుకొని ఉన్న అరెంజ్ రంగులో ఉన్న ఒక ఎలుకను శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఈ ఫోటోను అంగారకుడిపైని రాక్‌నెస్ట్ అనే ప్రాంతంలో రోవర్ తీసింది. ఈ ఫోటోలను పరిశీలించిన స్కాట్ వార్నింగ్ మాట్లాడుతూ, ఈ ఫోటోలో లైట్ కలర్‌లో కళ్లు, ముక్కు, చెవులు, ఇంకా ముందరి కాళ్లు కలిగివున్న ఎలుక కనిపించిందని, ఇది చూసేందుకు రాళ్లమధ్య దాగివున్నట్టుగా ఉందని చెబుతున్నారు. అయితే ఇదివరకే మనిషి కూర్చున్నట్టుగా ఉన్న రాళ్లను స్పిరిట్ రోవర్ తీసిన ఫోటోలో గమనించిన శాస్త్రవేత్తలు మనిషి రాతిపై కూర్చుని ఉందని, కాబట్టి అంగారకుడిపై జీవం ఉండే అవకాశం ఉందని అభిప్రాయపడిపోయారు. ఆ తర్వాత అవి రాళ్లని తేలింది. ఇప్పుడు ఈ ఎలుక కూడా రాయిలాంటిదే అయివుండవచ్చని కొందరు భావిస్తున్నారు.