Covid: కోవిడ్ ఎంఆర్ఎన్ఏ టీకాతో గుండెపోటు ముప్పు
- తీసుకున్న నెల రోజుల్లోనే మరణం
- ముఖ్యంగా 18-39 ఏళ్ల వారికి రిస్క్
- అప్పటికే గుండె జబ్బులు ఉండడం అదనపు రిస్క్
కరోనా నివారణకు ఇస్తున్న ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీ ఆధారిత టీకాలతో గుండె సమస్యలు ఏర్పడి మరణాల రిస్క్ పెరిగిపోతున్నట్టు ఫ్లోరిడాకు చెందిన సర్జన్ జనరల్ డాక్టర్ జోసెఫ్ లాడపో తెలిపారు. ముఖ్యంగా 18-39 సంవత్సరాల్లోపు వారికి రిస్క్ ఎక్కువగా ఉంటున్నట్టు చెప్పారు. కనుక గుండె జబ్బులున్నవారు ఎంఆర్ఎన్ఏ ఆధారిత టీకా తీసుకునే ముందు వైద్యుల సూచన తీసుకోవాలని సూచించారు.
‘‘కోవిడ్-19 ఎంఆర్ఎన్ఏ టీకాలకు సంబంధించి విశ్లేషణను విడుదల చేశాం. వాటిపట్ల అవగాహన ఉండాలి. ఈ అధ్యయనంలో భాగంగానే 18-39 ఏళ్ల వారికి అధిక రిస్క్ ఉంటున్నట్టు వెల్లడైంది. ఎంఆర్ఎన్ఏ టీకా తీసుకున్న 28 రోజుల్లోపు గుండె సంబంధిత మరణం చోటు చేసుకుంటోంది’’ అని వివరించారు.
ముఖ్యంగా అప్పటికే గుండె జబ్బులు ఉన్న వారికి ఈ టీకా ప్రాణాంతకమవుతోంది. మయోకార్డైటిస్, పెరికార్డైటిస్ కు దారితీస్తోంది. మన దేశంలో ఎంఆర్ఎన్ఏ తాలూకూ తొలి వ్యాక్సిన్ జెమ్ కోవాక్-19 త్వరలోనే అందుబాటులోకి రానుంది. కోవిషీల్డ్ వైరల్ వెక్టార్ ఆధారితం. కోవాగ్జిన్ అన్నది ఇన్ యాక్టివేటెడ్ వైరల్ వ్యాక్సిన్.