Naveen Chandra: నిజం చెబుతున్నాను .. నా స్వభావానికి విరుద్ధమైన పాత్ర అది: నవీన్ చంద్ర    

Ammu Movie Team Interview

  • ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రగా 'అమ్ము'
  • పోలీస్ ఆఫీసర్ పాత్రలో నవీన్ చంద్ర 
  • కీలకమైన పాత్రలో బాబీ సింహా 
  • ఈ నెల 19వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో

ఐశ్వర్య లక్ష్మి ప్రధానమైన పాత్రలో 'అమ్ము' సినిమా రూపొందింది. ఆమె భర్తగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నవీన్ చంద్ర నటించాడు. ఇక ఒక కీలకమైన పాత్రలో బాబీ సింహా కనిపించనున్నాడు. కార్తీక్ సుబ్బరాజు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమాకి చారుకేశ్ శేఖర్ దర్శకత్వం వహించాడు. అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల 19వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో ఈ సినిమా టీమ్ బిజీగా ఉంది. తాజా ఇంటర్వ్యూలో ఈ సినిమా టీమ్ పాల్గొంది. 

నవీన్ చంద్ర మాట్లాడుతూ .. "ఈ సినిమాలో నా పాత్ర పేరు రవి. చూడటానికి నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలా అనిపిస్తుంది. కానీ అతను ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడనే విషయానికి వెళితే, అతని చుట్టూ ఆనేక లేయర్స్ కనిపిస్తాయి. నిజ జీవితంలో నా స్వభావానికి .. ఈ సినిమాలో నేను పోషించిన రవి స్వభావానికి ఎక్కడా పోలిక ఉండదు. ఆ పాత్ర దరిదాపుల్లో కూడా రియల్ లైఫ్ లోని నేను కనిపించను" అన్నాడు. 

ఇక టాలీవుడ్ లో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న కార్తీక్ సుబ్బరాజు మాట్లాడుతూ .. " ఈ సినిమా కోసం నేను క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా మారడానికి కారణం ఈ కథలోని కొత్తదనం .. తక్కువ పాత్రల మధ్య నడిచే బలమైన కథనం నాకు నచ్చాయి. ఇక చారుకేశ్ పై నాకు గల నమ్మకం కూడా మరో కారణంగా చెప్పుకోవచ్చు" అన్నాడు.   


Naveen Chandra
Aishvarya lakshmi
Bobby Simha
Ammu Movie
  • Loading...

More Telugu News