Nagachaitanya: తెలుగు తెరపైకి 'కార్తీక దీపం' హీరోయిన్!

Deepa In Chaitu Movie

  • విశేషమైన ఆదరణ పొందుతున్న 'కార్తీక దీపం' సీరియల్ 
  • దీప పాత్రను పోషించిన ప్రేమి విశ్వనాథ్ 
  • ఫ్యామిలీ ఆడియన్స్ లో ఆమెకి విపరీతమైన క్రేజ్ 
  • చైతూ సినిమాలో ఛాన్స్ ఇచ్చిన వెంకట్ ప్రభు

బుల్లితెరపై ఇప్పుడు విశేషమైన ఆదరణ పొందుతున్న ధారావాహికగా 'కార్తీక దీపం' కనిపిస్తుంది. నిరుపమ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సీరియల్ లో, దీప పాత్ర ఒక రేంజ్ లో ప్రేక్షకులకు కనెక్ట్ అయింది. వంటలక్కగా ఆ పాత్రను 'ప్రేమి విశ్వనాథ్' పోషించింది. విశాలమైన కళ్లతో చకచకా హావభావాలను పలికించడం ఆమె ప్రత్యేకతగా కనిపిస్తూ ఉంటుంది.

ఫ్యామిలీ ఆడియన్స్ లో ప్రేమి విశ్వనాథ్ కి మంచి క్రేజ్ ఉంది. ఆమె కోసమే ఆ సీరియల్ ను ఫాలో అయ్యేవారు ఉన్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాంటి ఆమె తెలుగు తెరకి పరిచయమవుతోంది. నాగచైతన్య హీరోగా రూపొందుతున్న వెంకట్ ప్రభు సినిమాలో ఆమె ఒక కీలకమైన పాత్రను పోషించనుంది. ఆల్రెడీ ఈ సినిమా షూటింగు మొదలైపోయింది. 

వెంకట్ ప్రభు తెలుగు - తమిళ భాషల్లో రూపొందిస్తున్న ఈ సినిమాలో కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా కోసం ఎంచుకున్న మరికొంతమంది నటీనటుల పేర్లను ప్రకటిస్తూ వారి పోస్టర్లను వదిలారు. అరవింద్ స్వామి .. శరత్ కుమార్ .. సంపత్ రాజ్ .. ప్రేమ్ జీ అమరన్ .. వెన్నెల కిశోర్ .. ప్రియమణితో పాటు ప్రేమి విశ్వనాథ్ పోస్టర్ ను కూడా వదిలారు. ఇక ఇక్కడి సినిమాల్లోను  ఆమె బిజీ అవుతుందేమో చూడాలి.

Nagachaitanya
Krithi Shetty
Venkat Prabhu Movie
  • Loading...

More Telugu News