Kamal Haasan: 'విక్రమ్' సీక్వెల్ పై తేల్చిపారేసిన సూర్య

Vikram 2 movie update

  • వరుస ప్రాజెక్టులతో బిజీగా సూర్య 
  • తాజా ఇంటర్వ్యూ లో 'విక్రమ్ 2' ప్రస్తావన
  • రోలెక్స్ పాత్రపై స్పందించిన సూర్య 
  • ఇప్పట్లో సీక్వెల్ ఉండకపోవచ్చని వెల్లడి

కమల్ హీరోగా ఆయన సొంత బ్యానర్లో వచ్చిన 'విక్రమ్' సినిమా, టేకింగ్ పరంగా ప్రేక్షకులను ఒక ఊపు ఊపేసింది. కమల్ చేసిన యాక్షన్ సినిమాలలో ఇది ముందు వరుసలో నిలిచింది. 300 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. అలాంటి ఈ సినిమాలో విలన్ గా చివర్లో సూర్య ఎంట్రీ ఇస్తాడు. రోలెక్స్ గా పవర్ఫుల్ పాత్రలో ఆయన చెలరేగిపోయాడు. సెకండ్ పార్టు అంతా కూడా సూర్య జోరు కొనసాగుతుందన్నట్టుగా హింట్ ఇస్తూ ఫస్టు పార్టు ముగిసింది. 

ఇక 'విక్రమ్ 2' ఎప్పుడు ఉండనుందనే ప్రశ్న తాజా ఇంటర్వ్యూలో సూర్యకి ఎదురైంది. ఆ పాత్రను చేయవలసిన సమయం వచ్చినప్పుడు చేస్తాననీ, అందుకు ఇంకా సమయం ఉందని సూర్య సమాధానమిచ్చాడు. లోకేశ్ కనగరాజ్ తనని కలిసి కథ చెప్పినప్పుడు, విలన్ పాత్రే అయినా కమల్ సార్ కోసమే చేయాలనుకున్నాను .. చేశాను" అంటూ చెప్పుకొచ్చాడు. 

ప్రస్తుతం విజయ్ హీరోగా లోకేశ్ కనగరాజ్ ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఆ తరువాత సినిమాగా 'ఖైదీ 2' సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయిన తరువాతనే 'విక్రమ్ 2' పట్టాలెక్కనుంది. అందువల్లనే ఈ సీక్వెల్ ఇప్పట్లో ఉండకపోవచ్చనే అర్థంలో సూర్య ఆ మాటను అని ఉంటాడనేది కోలీవుడ్ టాక్.

Kamal Haasan
Lokesh kanagaraj
Surya
  • Loading...

More Telugu News