Munugode: ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామి ఇంటిలో భోజ‌నం చేసిన కేటీఆర్‌

ts minister takes lunch at floride affected persons house

  • చండూరులో నామినేష‌న్ వేసిన ప్ర‌భాక‌ర్‌రెడ్డి
  • కార్య‌క్ర‌మానికి హాజ‌రైన కేటీఆర్‌
  • అనంత‌రం శివ‌న్న‌గూడెంలో అంశాల స్వామి ఇంటికెళ్లిన వైనం
  • మ‌రో మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డితో క‌లిసి భోజ‌నం చేసిన కేటీఆర్‌

మునుగోడు ఉప ఎన్నిక‌ల్లో భాగంగా టీఆర్ఎస్ అభ్య‌ర్థి కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డి నామినేష‌న్ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యేందుకు గురువారం చండూరు వెళ్లిన ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌... నామినేష‌న్ అనంత‌రం నియోజ‌కవ‌ర్గ ప‌రిధిలోని శివ‌న్న గూడెం వెళ్లారు. గూడెంలో ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామి ఇంటికి వెళ్లిన కేటీఆర్‌... ఆయ‌న యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సంద‌ర్భంగా అంశాల స్వామి ఇంటిలోనే కేటీఆర్ మ‌ధ్యాహ్న భోజ‌నం చేశారు. నేల‌పై చాప ప‌ర‌చ‌గా దానిపై మ‌రో మంత్రి జ‌గదీశ్ రెడ్డితో క‌లిసి కూర్చున్న కేటీఆర్...అంశాల స్వామితో క‌లిసి భోజ‌నం చేశారు. ఈ సందర్భంగా త‌న ప‌క్క‌నే కూర్చున్న అంశాల స్వామికి భోజ‌నాన్ని వడ్డించారు.

More Telugu News