Manchu Vishnu: చూస్తుంటే 'జిన్నా' హిట్టు కొట్టేలానే ఉన్నాడే!

Ginna movie update

  • మంచు విష్ణు తాజా చిత్రంగా రూపొందిన 'జిన్నా'
  • విలేజ్ నేపథ్యంలో నడిచే విభిన్నమైన కథాంశం 
  • పాయల్ - సన్నీ గ్లామర్ ప్రత్యేకమైన ఆకర్షణ 
  • ఈ నెల 21వ తేదీన థియేటర్లకు రానున్న సినిమా

మంచు విష్ణు హిట్ అనే మాట వినేసి చాలా కాలమే అయింది. హీరోగా ... నిర్మాతగా కూడా ఆయనకి సక్సెస్ తో గ్యాప్ పెరిగిపోయింది. దాంతో ఆయన కూడా కాస్త సమయం తీసుకుని .. ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో 'జిన్నా' సినిమా చేశాడు. సొంత బ్యానరులో ఆయన నిర్మించిన ఈ సినిమాకి సూర్య దర్శకత్వం వహించాడు. 
 
'జిన్నా' టైటిల్ జనంలోకి బాగా వెళ్లింది. ఈ సినిమాలో మంచు విష్ణు మాస్ లుక్ తో కనిపించనున్నాడు. జనాలను థియేటర్స్ కి తీసుకుని రావడానికి, పాయల్ - సన్నీలియోన్ కి ఉన్న గ్లామర్ ఇమేజ్ సరిపోతుంది. ఇద్దరూ కూడా అందాలు ఆరబోయడంలో ఎలాంటి మొహమాటాలు లేనివారే అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. 

జి. నాగేశ్వర రెడ్డి కథ .. కోన వెంకట్ స్క్రీన్ ప్లే ఈ సినిమాను పట్టుగా నడిపించడం ఖాయమనే నమ్మకం జనంలో ఉంది. గతంలో మోహన్ బాబు మాస్ హీరోగా .. రొమాంటిక్ టచ్ ఉన్న యాక్షన్ కామెడీ సినిమాలతోనే ప్రేక్షకులను అలరించాడు. అలాంటి కంటెంట్ తోనే ఈ నెల 21న వస్తున్న ఈ సినిమా, బి - సి సెంటర్లలో బాగానే ఆడుతుందని అనిపిస్తోంది. చూడాలి మరి ఈ సినిమాతోనైనా విష్ణు హిట్ కొడతాడేమో!

Manchu Vishnu
Payal
Sunny Leone
Ginna Movie
  • Loading...

More Telugu News