Rishab Shetty: 'కాంతార' సినిమాతో సందడి చేయనున్న కన్నడ భామ!

Sapthami Gouda

  • కన్నడ బ్యూటీగా అనిపించుకున్న సప్తమి గౌడ 
  • 'కాంతార' హిట్ తో పెరిగిన క్రేజ్ 
  • ఈ నెల 15న తెలుగు వెర్షన్ రిలీజ్ 
  • ఇక్కడ నుంచి కూడా ఆఫర్లు వెళ్లే ఛాన్స్  

కన్నడ సినిమాతో ఈ మధ్య కాలంలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన అందమైన కథానాయికలలో శ్రీనిధి శెట్టి ఒకరు. మంచి హైటూ .. ఆకర్షణీయమైన రూపం ఉన్న శ్రీనిధి, ఇక్కడివారి మనసులను కొల్లగొట్టేసింది. ఇక్కడి అభిమానులంతా తెలుగు హీరోల జోడీగా ఆమె చేయాలనే ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆమె మాత్రం ఇటువైపు తొంగి చూడలేదు. 

ఈ నేపథ్యంలోనే కన్నడ నుంచి తెలుగు ఆడియన్స్ ను పలకరించడానికి మరో బ్యూటీ ఇప్పుడు రెడీ అవుతోంది. ఆ సుందరి పేరే సప్తమి గౌడ. అందానికి కేరాఫ్ అడ్రెస్ గా కనిపించే ఈమె కూడా బెంగుళూరు భామనే. అమ్మడు నేషనల్ స్థాయి స్విమ్మర్ కూడా. 'పాప్ కార్న్ మంకీ టైగర్' అనే కన్నడ సినిమాతో 2020లో ఆమె వెండితెరకి పరిచయమైంది. 

'కాంతార' సినిమాలో కథానాయికగా చేసిన దగ్గర నుంచి అందరూ ఆమెను గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ సినిమాలో డీ గ్లామర్ రోల్ చేసినా, ప్రమోషన్స్ లో ఈ బ్యూటీని చూసి గ్లామర్ పరంగా మంచి మార్కులు ఇస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా ఈవెంట్ లో, 'ఈ అమ్మాయి బయట చాలా బాగుంది' అంటూ అల్లు అరవింద్ అనడం విశేషం. ఈ సినిమా తరువాత టాలీవుడ్ అవకాశాలేమైనా పడుతుందేమో చూడాలి.

Rishab Shetty
Sapthami Gouda
Kantara Movie
  • Loading...

More Telugu News