Pooja Hegde: పూజకు ఈ ఏడాది ఎందుకో కలిసిరాలేదు!

Pooja Hegde Special

  • స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పేసిన పూజ హెగ్డే 
  • క్రితం ఏడాది వరకూ వరుస హిట్లు 
  • ఈ ఏడాదిలో భారీ పరాజయాలు 
  • చేతిలో ఉన్నది త్రివిక్రమ్ - మహేశ్ మూవీ మాత్రమే

పూజ హెగ్డే క్రితం ఏడాది వరకూ వరుస హిట్లతో దుమ్ము దులిపేసింది. కానీ ఈ ఏడాదిలో మాత్రం ఆమె అదృష్టం తలక్రిందులైంది. వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు చేసింది .. స్టార్ హీరోల సరసన మెరిసింది. ఆమె చేసిన 'రాధే శ్యామ్' .. 'బీస్ట్' .. 'ఆచార్య' చాలా తక్కువ గ్యాపులో థియేటర్లకు వచ్చాయి. ఈ మధ్య కాలంలో ఏ హీరోయిన్ చూడని ఒక దశను ఆమె చూసింది. 

ఈ మూడు సినిమాలు హిట్ అయితే ఆమె రేంజ్ వేరేగా ఉండేది. కానీ మూడు సినిమాలు కూడా ఒకదానికి మించి ఒకటి దెబ్బతిన్నాయి. పాన్ ఇండియా సినిమాలు ఆమె గ్రాఫ్ ను మరింత క్రిందికి తీసుకుని వెళ్లాయి. నిజానికి ఈ స్థాయి ఫ్లాపుల తరువాత తేరుకోవడానికి ఏ హీరోయిన్ కైనా కొంత సమయం పడుతుంది. కానీ పాపం పూజ వెంటనే కోలుకుని తన తదుపరి సినిమాలపై దృష్టి పెట్టింది.

పూజ ఒక వైపున తెలుగు .. మరో వైపున హిందీ సినిమాలు ప్లాన్ చేసుకుంటూ వెళుతోంది. ఆమె ప్లానింగులో ఎలాంటి సమస్య లేదు. కానీ ఎప్పుడో రిలీజ్ కావలసిన 'రాధే శ్యామ్' ఇంకెప్పుడో థియేటర్లకు వచ్చింది. అలాగే 'బీస్ట్' .. 'ఆచార్య' విషయంలోనూ అదే జరుగుతూ వచ్చింది. అటు చేసి ఇటు చేసి చాలా తక్కువ గ్యాపులో వరుసగా ప్రేక్షకుల ముందుకు వచ్చేశాయి. అవి ఫ్లాప్ కావడమే అసలు సమస్యగా మారింది. మళ్లీ ఆమె ప్రేక్షకుల ముందుకు రావడానికి చాలా సమయమే పడుతుంది. ఎందుకంటే మహేశ్ - త్రివిక్రమ్ సినిమా తప్ప ఆమె చేతిలో మరో ప్రాజెక్టు లేదు మరి!

More Telugu News