Rishabh Shetty: తెలుగులో తన ఫేవరెట్ స్టార్ ఎవరో చెప్పిన 'కాంతార' హీరో!

Rishabh Shetty Interview

  • కన్నడలో రిషబ్ శెట్టికి మంచి క్రేజ్ 
  • రీసెంట్ గా వచ్చిన 'కాంతార' బ్లాక్ బస్టర్ హిట్ 
  • ఈ నెల 15వ తేదీన తెలుగులో విడుదల 
  • ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న టీమ్  

రిషబ్ శెట్టి ఇప్పుడు ఇక తిరుగులేని స్టార్ అంటూ కన్నడ మీడియా చెబుతోంది. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'కాంతార' అక్కడ రికార్డుస్థాయి వసూళ్లను రాబడుతోంది. తెలుగులో ఈ నెల 15వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది. 'హోంబలే ఫిలిమ్స్' వారు నిర్మించిన ఈ సినిమాను తెలుగులో గీతా ఆర్ట్స్ వారు విడుదల చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. తాజా ఇంటర్వ్యూలో రిషబ్ శెట్టి పాల్గొనగా, 'టాలీవుడ్ లో మీ ఫేవరేట్ హీరో ఎవరు?' అనే ప్రశ్న ఆయనకి ఎదురైంది. అందుకు ఆయన  స్పందిస్తూ .. " తెలుగులో చాలా మంది స్టార్ హీరోలు ఉన్నారు .. ఎవరి ప్రత్యేకత వారిది. అందరి సినిమాలను నేను చూస్తుంటాను. 

ప్రభాస్ .. ఎన్టీఆర్ .. చరణ్ .. మహేశ్ బాబు .. అల్లు అర్జున్ సినిమాలను వదలకుండా చూస్తుంటాను. ఎలాంటి కథను ఎంచుకున్నా తమదైన ముద్ర వేయడంలోను ... ప్రేక్షకులపై ప్రభావం చూపడంలోను వాళ్లు ముందుంటారు. అందరి కంటే ఎక్కువగా అభిమానించే హీరో ఎవరంటే మాత్రం ఎన్టీఆర్ పేరు చెబుతాను" అన్నాడు. ఎన్టీఆర్ కి కన్నడలోను మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే.

Rishabh Shetty
Sapthami Gouda
Kantara Movie
  • Loading...

More Telugu News