Chiranjeevi: ఇది చిరంజీవి, తమన్, మోహన్ రాజాల కష్టానికి దక్కిన ఫలితం: ఎన్వీ ప్రసాద్

Collections details of Chiranjeevi God Father
  • ఊహించిన దానికంటే ఎక్కువ కలెక్షన్లు వస్తున్నాయన్న నిర్మాత ఎన్వీ ప్రసాద్
  • తెలుగు రాష్ట్రాల్లో రూ. 60 కోట్ల షేర్ రాబట్టిందని వెల్లడి
  • హిందీలో రూ. 10 కోట్లు వసూలు చేసిందన్న ఎన్వీ ప్రసాద్
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం 'గాడ్ ఫాదర్' దుమ్ము రేపుతోంది. బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ సినిమా సాధించిన విజయంపై చిత్ర నిర్మాత ఎన్వీ ప్రసాద్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అన్ని ప్రాంతాల్లో ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారని ఆయన అన్నారు. చిరంజీవి, తమన్, దర్శకుడు మోహన్ రాజాల కష్టానికి ఫలితం ఈ విజయమని చెప్పారు. ఈ సినిమాను ఏ ఎగ్జిబిటర్ కు తాము అమ్మలేదని... తామే సొంతంగా విడుదల చేశామని అన్నారు. ఎవరీకీ ఇబ్బంది ఉండకూడదనే ఈ పని చేశామని... ప్రస్తుతం ఈ సినిమా నిర్మాతగా సంతోషంగా ఉన్నామని చెప్పారు. 

తాము ఊహించిన దాని కంటే కలెక్షన్స్ ఎక్కువగా వస్తున్నాయని ఎన్వీ ప్రసాద్ తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో రూ. 60 కోట్ల వరకు షేర్ రాబట్టిందని చెప్పారు. ఓవర్సీస్ లో కూడా సినిమాకు మంచి ఆదరణ లభించిందని... అమెరికాలో రెండు మిలియన్ డాలర్ల వసూళ్లను రాబడుతుందని భావిస్తున్నామని తెలిపారు. హిందీలో సైతం ఈ చిత్రం మంచి బిజినెస్ చేస్తోందని... తొలి వారంలో రూ. 10 కోట్ల వసూళ్లను రాబట్టిందని... ఇది మామూలు విషయం కాదని అన్నారు.
Chiranjeevi
God Father
Collections
Tollywood

More Telugu News