Allu Aravind: మెగా ఫ్యామిలీతో అల్లు ఫ్యామిలీకి చెడిందనే ప్రచారంపై అల్లు అరవింద్ స్పందన ఇదే!

Allu Aravind Interview

  • మెగా ఫ్యామిలీతో అల్లు ఫ్యామిలీకి మనస్పర్థలు వచ్చాయంటూ ప్రచారం 
  • తాజా ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పందించిన అల్లు అరవింద్ 
  • అలా అనుకోవడానికి గల కారణం ఇదేనంటూ వివరణ 
  • అందరం ఒకే మాటపై ఉన్నామంటూ స్పష్టీకరణ

మెగా ఫ్యామిలీకి .. అల్లు ఫ్యామిలీకి రంగం చెడిందనే టాక్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తోంది. పవన్ పేరును తాను చెప్పనని ఒక వేదికపై బన్నీ చెప్పడం .. అతనిని మెగాస్టార్ అంటూ అభిమానులు పిలుస్తున్నా ఆయన వాటిని ఖండించకపోవడం .. గీతా ఆర్ట్స్ లో చిరూ సినిమా చేయకపోవడం ఈ రకమైన ప్రచారానికి కారణమైంది. 

మెగా - అల్లు ఫ్యామిలీ మధ్య మనస్పర్థలు తలెత్తాయనే ప్రచారం గురించిన ప్రస్తావన, 'ఆలీతో సరదాగా' వేదికపై వచ్చింది. అందుకు అల్లు అరవింద్ స్పందిస్తూ .. "సొసైటీలో ఇలా అనుకోవటం సహజం. చిరంజీవి ... నేను ఇద్దరం కూడా బావా .. బావమరిదిలా కాకుండా మంచి స్నేహితులుగా పైకి వచ్చాము. మా పిల్లలు ఇదే వృత్తిలో ఉన్నారు. ఉన్న అవకాశాలనే వీళ్లంతా పంచుకోవాలి. 

రెండు కుటుంబాలకు చెందిన పిల్లలంతా పోటీ తత్వంతో .. ఎవరి స్థానాన్ని వారు తీసుకుంటూ ఎదుగుతూ వెళుతున్నారు. అలాంటప్పుడు ప్రజలు ఇలా అనుకోవడం సహజమే. ఎప్పటిలానే మేమంతా ఒకే మాటపై నిలబడుతూ వస్తున్నాము. మొన్న మా నాన్నగారికి సంబంధించిన ఫంక్షన్ ని కలిసి సెలబ్రేట్ చేసుకోవడమే ఇందుకు నిదర్శనం. ఇప్పటికీ కూడా మేమంతా సంక్రాంతి .. దీపావళి పండుగలను చిరంజీవి ఇంటికి వెళ్లి అక్కడే జరుపుకుంటాము. కాకపోతే ఈ విషయాలు జనాలకు తెలియదు" అంటూ చెప్పుకొచ్చారు.

Allu Aravind
Ali
Alitho Saradaga
  • Loading...

More Telugu News