paragliding: పెంపుడు కుక్కతో పారా గ్లైడింగ్..తిట్టిపోసిన నెటిజన్లు

Pet dog goes paragliding with hooman Internet is divided over viral video

  • వీడియోను నెట్లో పెట్టిన వ్యక్తి
  • వైరల్ గా మారిన వీడియో
  • కుక్క చాలా భయపడిందని ఆగ్రహం

పారా గ్లైడింగ్ చేయాలంటే చాలా ధైర్యం అవసరం. కామన్ గా ఒక్కరు లేదంటే ఇద్దరు మనుషులు పారా గ్లైడింగ్ చేస్తుంటారు. అలవాటు లేనివాళ్లు ట్రైనర్ సాయంతో గాల్లో తేలియాడుతుంటారు. కానీ, ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కతో పారాగ్లైడింగ్ చేసి ఆశ్చర్య పరిచారు. ఈ సమయంలో రికార్డు చేసిన వీడియోను నెట్ లో పెట్టారు. ఇప్పుడీ వీడియో వైరల్ అయింది. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు భిన్నంగా స్పందించారు. 

పారాగ్లైడింగ్ టైమ్ లో కుక్క చాలా భయపడిందంటూ సదరు వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుక్క కళ్లలో చాలా భయం కనిపించిందని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. దాని కళ్లు చూస్తేనే ఈ విషయం అర్థం అవుతోందన్నాడు. ఇలాంటి చెత్త పనులు చేసి మూగ జీవాలను హింసించవద్దని మరికొందరు అభిప్రాయపడ్డారు.
.

  • Loading...

More Telugu News