Komatireddy Raj Gopal Reddy: దేశంలోనే ఇది అతిపెద్ద భూ కుంభకోణం: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

KCR family grabbed lands says Komatireddy Raj Gopal Reddy

  • ధరణి పోర్టల్ తో కేసీఆర్ కుటుంబం భూ ఆక్రమణలకు పాల్పడిందన్న కోమటిరెడ్డి
  • హైదరాబాద్ పరిసరాల్లో రూ. 18 లక్షల కోట్ల విలువైన భూములను ఆక్రమించారని ఆరోపణ
  • ధరణి పోర్టల్ పై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్

మునుగడులో అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇంటింటికీ వెళ్తూ ఓటర్లను కలుస్తున్నాయి. ఈ క్రమంలో అన్ని పార్టీలు తమ ప్రత్యర్థులపై విమర్శలను ఎక్కు పెడుతున్నాయి. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ... కేసీఆర్ కుటుంబంపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ధరణి పోర్టల్ తో కేసీఆర్ కుటుంబం పెద్ద ఎత్తున భూ ఆక్రమణలకు పాల్పడిందని అన్నారు. 

ఒక్క హైదరాబాద్ పరిసరాల్లోనే ఏకంగా రూ. 18 లక్షల కోట్ల విలువైన భూములను ఆక్రమించారని చెప్పారు. మన దేశంలోనే ఇది అతిపెద్ద భూ కుంభకోణమని అన్నారు. ధరణి పోర్టల్ పై ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Komatireddy Raj Gopal Reddy
BJP
KCR
TRS
Dharani Portal
Land Scam
  • Loading...

More Telugu News