Ajith: ఎవడొస్తాడో రండిరా అన్నట్టుగా అజిత్ లుక్ .. సంక్రాంతి బరిలో నిలబడతాడట!

Thunivu movie update

  • షూటింగు దశలో 'తునివు'
  • అజిత్ కి ఇది 61వ సినిమా 
  • కథానాయికగా మంజు వారియర్ 
  • కీలకమైన పాత్రలో సముద్రఖని

టాలీవుడ్ లో స్టార్ హీరోలందరికీ దాదాపుగా సంక్రాంతి సెంటిమెంట్ ఉంది. సంక్రాంతికి తమ సినిమాను బరిలో నిలపడానికి అందరూ ప్రయత్నిస్తూనే ఉంటారు. అలా ఈ సారి సంక్రాంతికి చిరంజీవి 'వాల్తేర్ వీరయ్య' .. ప్రభాస్ 'ఆది పురుష్' .. 'విజయ్ 'వారసుడు' సినిమాలు బరిలోకి దిగుతున్నాయి. ఈ మూడు సినిమాలపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. 

ఈ మూడు సినిమాలకి ఆశించిన స్థాయిలో థియేటర్లు దొరకడం సాధ్యమయ్యే పనేనా? అని అంతా అనుకుంటూ ఉండగా, 'నేను కూడా సిద్ధంగానే ఉన్నాను' అంటూ అజిత్ సంకేతాలు ఇవ్వడం ఆశ్చర్యం. అజిత్ హీరోగా బోనీకపూర్ నిర్మాణంలో 'తునివు' సినిమా రూపొందింది. ఆల్రెడీ అజిత్ కి రెండు హిట్లు ఇచ్చిన హెచ్ వినోద్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. కెరియర్ పరంగా అజిత్ కి ఇది 61వ సినిమా. 

ఈ సినిమా నుంచి వదిలిన అజిత్ లుక్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. వైట్ హెయిర్ .. గెడ్డం .. చెవి రింగుతో ఆయన అభిమానులను ఆకట్టుకున్నాడు. చేతిలో గన్ పట్టుకుని ఆయన చాలా కూల్ గా కూర్చున్న తీరు చూస్తుంటే, ఇది భారీ యాక్షన్ మూవీ అనే విషయం అర్థమవుతూనే ఉంది. కథానాయికగా మంజు వారియర్ .. కీలకమైన పాత్రలో సముద్రఖని కనిపించనున్నారు. సంక్రాంతికి ఈ సినిమా కూడా విడుదలైతే, ఇక్కడ థియేటర్ల పరిస్థితి మరింత టైట్ అవుతుందేమో చూడాలి.

Ajith
Manju Warrier
Samudrakhani
Thunivu Movie
  • Loading...

More Telugu News