Congress: నన్ను వేధించేందుకు మౌనంగా ఉంటూ కొత్త వ్యూహం: ప్రధాని మోదీ

Congress outsourced contract of abusing me says pm modi

  • కాంగ్రెస్ పార్టీ ఇన్నాళ్లూ తనపై దుర్భాషలాడిందని ఆరోపణ
  • ఇప్పుడు తనను వేధించే కాంట్రాక్టును ఆప్ పార్టీకి ఇచ్చిందని విమర్శ
  • గుజరాత్ పరువు తీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం

ఇన్నాళ్లుగా తనను దుర్భాషలాడుతూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మౌనంగా ఉంటూ కొత్త వ్యూహాలు పన్నుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. తనను వేధించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీకి కాంట్రాక్టును ఔట్ సోర్సింగ్ కు ఇచ్చిందని విమర్శించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రత్యేకంగా దృష్టి సారించడం, ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ లో విస్తృతంగా పర్యటిస్తూ మోదీపై, బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుండటంతో ప్రధాని మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

గుజరాత్ పరువు తీసే ప్రయత్నాలు

20 ఏళ్లుగా గుజరాత్ కు వ్యతిరేకంగా పనిచేసి వారు ఇప్పుడు రాష్ట్రం పరువు తీయడానికి ప్రయత్నిస్తున్నారని మోదీ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ వ్యూహాల పట్ల జాగ్రత్తగా ఉండాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇన్నాళ్లూ తనను దారుణంగా దుర్భాషలాడారని.. ఇప్పుడు మౌనంగా గ్రామాలకు వెళ్లి ప్రజలను ఓట్లు అడుగుతున్నారని కాంగ్రెస్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో తనను వేధించేందుకు ఆప్ కు కాంట్రాక్టు ఇచ్చారని.. గుజరాత్ లో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

Congress
BJP
Narendra Modi
AAP
Political
Gujarat
National
  • Loading...

More Telugu News